Wednesday, 4 November 2026

దంపతుల ఆత్మహత్య

అనంతపురం,జూన్‌25(జ‌నం సాక్షి ): అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలో సోమవారంఉదయం విషాదం చోటుచేసుకుంది. చెట్టుకు ఉరేసుకుని బళ్లారికి చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.