దక్షిణాదిపై ఉత్తరాధి ఆధిపత్యం

4

– ఆంధ్రాకు పాచిపోయిన లడ్డు ఇచ్చారు

– పవన్‌ కళ్యాణ్‌ ఆక్రోశం

కాకినాడ,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): ప్రత్యేక¬దాపై విూకు చేతకాకుంటే చెప్పండి..జనసేన అప్పుడు పోరాడుతుందని టిడిపి, బిజెపిలకు నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఉత్తరాది వారికన్నా దక్షిణాది వారు తక్కువ కాదని, మాకేం దేశభక్తి తక్కువగా లేదని, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని కేంద్రాన్ని హెచ్చరించారు. కాకినాడలో జనసేన ఆధ్వర్యంలో సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించారు. సభ ప్రారంభంకాగానే ఆయన ప్రజలందరికీ అభివాదం చేస్తూ దేశ భక్తి ఉత్తర భారతీయులకే కాదు దక్షిణభారతీయులకూ ఉందన్నారు. భారత రాజ్యాంగంపై ఉత్తరాదికి ఎంత గౌరవం ఉందో దక్షిణ భారతానికీ అంతే గౌరవం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలచేత భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలు చేయించారు.ప్రత్యేక ¬దా ఇస్తామంటూ గత రెండేళ్ల నుంచీ ఊరిస్తున్న కేంద్రం పాచిపోయిన రెండు లడ్డూలు ఆంధ్రులకు ఇచ్చిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. ప్యాకేజీ ఇస్తారనుకుంటే రెండు లడ్డూలు చేతిలో పెట్టారని చెప్పారు. టిడిపి,బిజెపి  నేతలంతా అదిగదిగో అంటూ ప్రజలను ఆశ పెట్టారని చెప్పారు. అవకాశవాద రాజకీయాల వల్ల గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో విభేదాల్లేవని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను అవకాశవాదంగా మార్చుకుంటున్న వారిని హెచ్చరిస్తున్నానని చెప్పారు. రాజకీయనాయకులంతా దేశంలోని సమస్యలు తీర్చలేకపోయినా పర్వాలేదని… మరింతగా పెంచొద్దని హితవు పలికారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబులకు ఆయన నేరుగానే హెచ్చరిక చేశారు. ఇచ్చిన హావిూని నిలబెట్టుకోవాలని వెంకయ్యనాయుడుకు సూచించారు. ఇందుకోసం పోరాడలని బాబుకు సూచించారు. తాను ఉడతాభక్తిగా టిడిపి,బిజెపిలకు ఎన్నికల సమయంలో తోడ్పడ్డానని, దానిని తక్కువ చేయవద్దన్నారు. భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఇక్కడికి రాలేదని మనకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకే వచ్చానని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. బంద్‌లు చేయాలని తాను చెప్పనని.. అయితే రేపు వైకాపా, వామపక్షాలు ప్రకటించిన బంద్‌లో పాల్గొనాలా వద్దా అనేది విూ ఇష్టానికి వదిలేస్తున్నాని కార్యకర్తలకు చెప్పారు. అయితే బంద్‌ చేసి విూరెందుకు కష్టపడాలి, పదవులు అనుభవిస్తున్నవారు పోరాడాలి.. అని పవన్‌కల్యాణ్‌ అన్నారు. కాకినాడలో  సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో మాట్లాడుతూ ఆయన ఏ తప్పూ చేయని ప్రజలు పోరాడుతూంటే వాళ్లు మిన్నకుంటామంటే తాను ఒప్పుకోనన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలే ప్రజల తరఫున పోరాడాలని.. వారు చేయాల్సింది చెయ్యకుండా ప్రజలే అన్నీ చేయాలంటే ఎలా అని ప్రశ్నించారు.కాంగ్రెస్‌ది 150 ఏళ్ల చరిత్రేనని ఒప్పుకుంటానని.. కానీ లాల్‌బహదూర్‌ శాస్త్రి నాటి విలువలున్నాయా? ఇందిరాగాంధీ పాటించిన సిద్ధాంతాలు పాటిస్తున్నారా అని పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. 2004లో అవకాశవాద రాజకీయాల కోసం, పదవుల కోసం పాకులాడారన్నారు.

కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిచిందని.. న్యాయం చేయమని భాజపా వద్దకు వెళ్తే అది పొట్టలో పొడిచిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతీయవాదం గురించి గొప్పలు చెప్పే ఆ రెండు జాతీయ పార్టీలు నేడు తెలుగు రాష్టాల్ల్రో అస్థిరత సృష్టించాయని ఆవేశంగా ప్రసంగించారు. తెలుగురాష్టాన్న్రి విడగొట్టిన విూరు అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయలేదని చెప్పారు. అటు తెలంగాణకు హైకోర్టును ఇవ్వకపోగా.. ఇటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దాను ఇవ్వకుండా రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని మండిపడ్డారు. భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఇక్కడికి రాలేదని మనకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకే వచ్చానని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. బంద్‌లు చేయాలని తాను చెప్పనని.. అయితే రేపు వైకాపా, వామపక్షాలు ప్రకటించిన బంద్‌లో పాల్గొనాలా వద్దా అనేది విూ ఇష్టానికి వదిలేస్తున్నాని కార్యకర్తలకు చెప్పారు. అయితే బంద్‌ చేసి విూరెందుకు కష్టపడాలి, పదవులు అనుభవిస్తున్నవారు పోరాడాలి.. అని పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఏ తప్పూ చేయని ప్రజలు పోరాడుతూంటే వాళ్లు మిన్నకుంటామంటే తాను ఒప్పుకోనన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలే ప్రజల తరఫున పోరాడాలని.. వారు చేయాల్సింది చెయ్యకుండా ప్రజలే అన్నీ చేయాలంటే ఎలా అని ప్రశ్నించారు.  రాష్ట్ర విభజన సమయంలో తాను ఎంతో బాధపడ్డానని… 11 రోజుల పాటు అన్నం కూడా మానేశానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చెప్పారు. సీమాంధ్ర నేతలను తెలంగాణ నాయకులు సన్నాసులని తిడుతుంటే.. వీళ్లకి పౌరుషం లేదా అని బాధపడ్డానని చెప్పారు. పార్లమెంట్‌లో తెదేపా ఎంపీ కొనకళ్ల నారాయణపై దాడి చేస్తే చాలా మదనపడ్డానని చెప్పారు. పార్లమెంట్‌ సమగ్రతకు, దాని ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక ¬దా ఇస్తామంటూ మూడు నాలుగేళ్లు చెప్పి.. చివరకు రెండు లడ్డూలు చేతిలో పెట్టారని, విూరిచ్చిన పాచిపోయిన లడ్డూలు మాకొద్దని జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు.  కాంగ్రెస్‌ వాళ్లు వెన్నుపోటు పొడిచారని బీజేపీ దగ్గరకు వెళ్తే.. బీజేపీ వాళ్లు పొట్టలో పొడిచారని అన్నారు. అటు తెలంగాణకూ న్యాయం చేయలేదని, వాళ్లకు హైకోర్టును ప్రత్యేకంగా ఇవ్వమంటే ఇవ్వడంలేదని.. ఇటు ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇవ్వడం లేదని.. వాటిని అడుగుతుంటే మాత్రం రెండు పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారని విమర్శించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారని, దీనికి స్వార్థ రాజకీయాలే కారణమని అన్నారు. పౌరుషం చచ్చిందనుకుంటున్నారా.. పోరాటపటిమ తగ్గిందనుకున్నారా అంటూ గర్జించారు. 2014లో రాష్ట్రాన్ని విడగొట్టినప్పటి నుంచి ప్రతి బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ, ప్రతి టీడీపీ నేత ప్రత్యేక¬దా ఇస్తామని చెప్పారని, తాను కూడా వాళ్ల మాటలు నమ్మానని చెప్పారు. టీడీపీ నేతలపై ఇప్పటికీ తనకు గౌరవం తగ్గలేదని, కానీ ప్రజా సమస్యల విషయంలో మాత్రం తన వైఖరి ఇంతేనని స్పష్టం చేశారు. పాచిపోయిన ఆ లడ్డూలు టీడీపీ తీసుకుంటుందా లేదా అనేది తనకు అనవసరం అన్నారు. విూరు సమస్యలను పట్టించుకోకపోయినా పర్వాలేదు గానీ, కొత్త సమస్య సృష్టించవద్దని చెప్పారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టే దరిద్రపు ఆలోచనలు దయచేసి ఆపాలన్నారు. కళ్లు మూసుకుంటే నిద్ర కాదు.. జ్ఞానం అనుకోరా అని ప్రశ్నించారు. తాను రెండున్నరేళ్లుగా నిద్రలో లేనని తెలిపారు. రాజకీయాలంటే గడ్డం గీసుకున్నంత తేలిక కాదన్నారని.. కానీ గడ్డం గీసుకున్నంత తేలికగా రెండు రాష్ట్రాలు  ఇచ్చారుగా అని పవన్‌ ప్రశ్నించారు. తాను సినిమా హీరోను కావొచ్చు గానీ విూలాగా వేల కోట్లు వేల ఎకరాలు సంపాందించుకోలేదని చెప్పారు.  తన తాత ఒక పోస్ట్‌ మ్యాన్‌ అని, తన తండ్రి పోలీస్‌ కానిస్టేబుల్‌ అని, తమకు రాజకీయాలు తెలియదని, తాము చాలా సామాన్యులమని, అందుకే అందరిలాగే బతకడం ఇష్టమని అన్నారు. సినిమాలు వదిలేయమంటే ఇప్పుడే వదిలేస్తానని, అలా వదిలేస్తే విూరే తనకు భోజనం పెట్టాలని చెప్పారు.

ఎంపీలూ వ్యాపారంపై శ్రద్ద ప్రజలపైనా పెట్టాలి

ఎంపీలు వ్యాపారాలు చేయడం తప్పని అనలేదని పవన్‌ స్పష్టం చేశారు. ఎంపీలు తమ వ్యాపారాలపై చూపిన దక్షత ప్రజా సమస్యలపై పెట్టాలన్నారు. సొంత లాభం కొంతన్నా మానుకోండని ఎంపీలకు సూచించారు. విూరు సుఖపడండి పర్లేదు, ప్రజలను మాత్రం కష్టపెట్టకండని పవన్‌ అన్నారు.పవన్‌ ప్రత్యేక ¬దాపై ఎంపీలు కేంద్రానికి లొంగిపోతే మాట ఇచ్చి తప్పించుకున్నారని ప్రజలు అనుకుంటారని గుర్తుచేశారు.  మేం వద్దనుకున్న రాజ్యసభ సీటులో టీజీ వెంకటేష్‌ కూర్చున్నాడని జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ పేర్కొన్నారు. టీజీ వెంకటేష్‌  నా గురించి మాట్లాడాడని, నేను మాట్లాడాల్సి వస్తే చాలా మాట్లాడగలను అని న్నారు. కర్నూలులో టీజీ వెంకటేష్‌ పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయన్నారు. జనసేన జనసేన వద్దనుకున్న రాజ్యసభ సీటులో ఆయన కూర్చున్నారన్నారు. సముద్రం ఒకడి ఎదుట తలవంచదని… ఆత్మగౌరవం ఉన్నోడు కేంద్రం ఎదుట జీహుజూర్‌ అంటూ గులాంగిరీ చేయడని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టవద్దని, తల ఎత్తి వ్యవహరించండని టిడిపి నేతలకు సూచించారు. ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు భాజపా నాయకులు మనకు అర్ధం అయ్యేలా చెప్తారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అలా చెప్పడం లేదని విమర్శించారు. విూరు చెప్పిన హ్యాపీడేస్‌ ఎక్కడంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. పార్టీ మేనిఫెస్టోకు ఇచ్చిన విలువ పార్లమెంట్‌సాక్షిగా ఇచ్చిన మాటకు ఇవ్వడంలేదన్నారు. ¬దా కోసం పోరాడతానంటే తన ఎంపీ స్థానాన్ని పవన్‌కు వదిలేస్తానని చెప్పిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌కు రాజీనామా చేసి విూరు స్ఫూర్తిగా నిలవాలని పవన్‌ హితవు పలికారు. విూరు రాజీనామా చేసి పోరాడితే.. మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత జనసేన సైనికులదని ఆయన చెప్పారు. సొంత లాభం కొంత మానుకోమని మాత్రమే పార్లమెంట్‌ సభ్యులకు చెప్తున్నానని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. తన అన్న, వదిన, అక్కచెల్లెళ్లని వదిలి తెదేపా, భాజపా తరఫున పోరాడేందుకు ముందుకు వచ్చానని చెప్పారు. 2004 నుంచి తెలంగాణ ఇస్తామని చెప్పిన జైరాం రమేశ్‌ లాంటి వారు తమకు రాజధాని గురించి ముందే ఎందుకు చెప్పలేదని.. నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు తప్పు చేశారని.. మాట ఇచ్చి తప్పారని.. ప్రజలే వారిని నిలదీయాలన్నారు. రాజకీయాల గురించి తెదేపా నేత టీజీ వెంకటేశ్‌ దగ్గర్నుంచి తాను నేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. జనసేన వదిలేసిన రాజ్యసభ సీట్లో టీజీ వెంకటేశ్‌ కూర్చున్నారన్న పవన్‌, తాను మాట్లాడదల్చుకుంటే కర్నూలులో వారి ఫ్యాక్టరీలు వెలువరిస్తున్న కాలుష్యం గురించి చాలా మాట్లాడగలనన్నారు. తాను రాజకీయ డ్రామాలు చేయనని, చేయదలచుకుంటే తాడోపేడో తేల్చుకుంటానని పవన్‌ అన్నారు.

అవంతి శ్రీనివాస్‌ ఆదర్శంగా నిలబడు

అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్‌కు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. ప్రత్యేక ¬దా కోసం అవంతి శ్రీనివాస్‌ ఎంపీ పదవికి రాజీనామా చేస్తే జనసేన నుంచి అనకాపల్లి టికెట్‌ ఇచ్చి తాను అక్కడే కూర్చుని గెలిపిస్తానంటూ పేర్కొన్నారు. అలాగే తాను ఎంపీ కావాలనుకుంటే గతంలో పీఆర్పీ నుంచే పోటీ చేసి గెలిచేవాడినన్నారు. ప్రస్తుత ఎంపీలందరూ ప్రత్యేక ¬దా కోసం రాజీనామాలు చేసి అందరికీ మార్గదర్శకంగా నిలవాలన్నారు. అలాగే సీమాంధ్రులకు అన్యాయం జరుగుతున్నా వెంకయ్యనాయుడు మాట్లాడడం లేదన్నారు. పెద్దరికం విూద వేసుకొని తిరుగుతున్నారన్నారు. వెంకయ్యపై అభిమానం ఉన్నా వ్యతిరేకంగా మాట్లాడక తప్పడం లేదన్నారు.