హైదరాబాద్,మే23( జనం సాక్షి): పుత్రశోకంలో ఉన్న మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో పరామర్శించారు. వైష్ణవ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే అంత్యక్రియలకు కేందప్రభుత్వ ప్రతినిధిగా రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను హాజరుకావాల్సిందిగా ప్రధాని మోదీ సూచించారు. ఇదిలావుంటే పలువురు కేంద్రమంత్రులు కూడా దత్తాత్రేయను పరామర్శించారు. ఉపరాస్టప్రతి వెంకయ్యనాయుడు పోన్ ద్వారా పరామర్శించారు. ఈ కష్ట సమయంలో ఆయనకు భగవంతుడు అండగా నిలవాలని ఆకాంక్షించారు.
దత్తాత్రేయకు ప్రధాని పరామర్శ




