జనం సాక్షి :హైదరాబాద్:: మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. మూడు రోజుల క్రితం దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ గుండెపోటుతో అకాల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి.. ఆదివారం రాంనగర్‌లోని దత్తాత్రేయ నివాసానికి వచ్చి అయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైష్ణవ్ చిత్రపటానికి నివాళులర్పించారు. పిన్న వయస్సులోనే వైష్ణవ్ దూరమవడం బాధాకరమన్న ఆయన.. దత్తాత్రేయను ఓదార్చారు.
దత్తాత్రేయను పరామర్శించిన మాజీ సిఎం




