Thursday, 5 November 2026

దళితులను అవమానిస్తే ఊరుకోం : మందా

manda jagannatham fire on Telangana TDP leaders

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలు ఎస్సీలను బద్నాం చేస్తున్నారని, దళితులను అవమానిస్తే ఊరుకోమని టీఆర్‌ఎస్ నేత మందా జగన్నాథం హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో మందా జగన్నాథం మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎస్సీలకు అన్యాయం జరుగుతున్నదని టీడీపీ నేతలు అనడం సరికాదన్నారు. మరీ కడియం శ్రీహరి మాదిగ కాదు.. మాల కాదు.. అని టీడీపీ నేతలు అంటున్నారు. ఆనాడు ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో కడియం శ్రీహరి మంత్రిగా పని చేశారు. అప్పుడు శ్రీహరి కులం గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. మరీ ఆ సమయంలో ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది అని ఎందుకు ప్రశ్నించలేదు? శ్రీహరి బైండ్ల కులానికి చెందిన వ్యక్తి. బైండ్ల కులానికి మాదిగ కులానితో సంబంధం ఉందన్నారు. మాదిగ ఉపకులాలలో బైండ్ల ఒకటి అని గుర్తు చేశారు. లేనిపోని మాటలు మాట్లాడి రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *