Thursday, 5 November 2026

రూ.లక్ష కోట్లకు పైగా ఆదాయం!

మునుపెన్నడూ లేనివిధంగా నిర్వహిస్తున్న స్పెక్ట్రమ్ వేలంలో ఇప్పటిదాకా 94,000 కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. సోమవారానికి వేలం ఐదోరోజుకు చేరగా, ఈ వేలంలో 2జి, 3జి స్పెక్ట్రమ్ ను కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తోంది. ప్రధాన టెలికాం ఆపరేటర్లందరూ వేలంలో పాల్గొంటున్న క్రమంలో సంస్థల నుంచి బిడ్లు ఇలాగే దాఖలైతే ప్రభుత్వానికి ఈ వేలం ద్వారా లక్ష కోట్ల రూపాయలకుపైగానే ఆదాయం రావచ్చన్నది అంచనా. శనివారం నాటికి 24 రౌండ్ల బిడ్డింగ్ పూర్తవగా, 86,000 కోట్ల రూపాయల విలువైన బిడ్లు వచ్చాయి. సోమవారం మరో 7 రౌండ్లు పూర్తవడంతో ఇప్పటిదాకా మొత్తం 31 రౌండ్లు పూర్తవగా, 96,000 కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *