హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెనుక దళితులు రారని…వెంట పడుతారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బంగారు తెలంగాణ అంటే పర్యాయపదం దొరల తెలంగాణ అని తెలిపారు. అసలు దళితులు మీ వెంట ఎందుకు వస్తారో ఆలోచించాలన్నారు. దళితులు కేసీఆర్ వెంబడి రారని, మోసం చేశారని గ్రహించారని పేర్కొన్నారు. తొలి సీఎం దళితుడే అని అన్నారు..కానీ చేయలేదని అందుకు మీ వెనుక రావాలా ? మాజీ డిప్యూటి సీఎం రాజయ్యను అవమానకరంగా బర్తరఫ్ చేశారు అందుకని మీ వెంట రావాలా అని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.
దళితులు వెంటబడుతరు – మందకృష్ణ మాదిగ..




