దళిత, గిరిజనులకు తీరని అన్యాయం


ఇంద్రవెల్లి స్మారకంలో సీతకక్క నివాళి
ఆదిలాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి ఎమ్మెల్యే సీతక్క నివాళులు అర్పించారు. అంతర్జాతీయ గిరిజన దినోత్వసం సందర్భంగా కాంగ్రెస్‌ నిర్వహించే సభకోసం సీతక్క ఇక్కడికి వచ్చారు. ఈ క్రమంలో ఇందరవెల్లి అమరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దళిత, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడతామన్నారు. సమైక్య పాలనలో జరిగిన కాల్పుల గురించి ప్రస్తావించడం సరికాదన్నారు. స్వరాష్ట్రంలో గిరిజనులను కాల్చిచంపిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు. ఆ నాటి తప్పును కాంగ్రెస్‌ సరిదిద్దుకుందని.. ఆదివాసులకు క్షమాపణ చెప్పడం కూడా జరిగిందని ఎమ్మెల్యే సీతక్క
పేర్కొన్నారు. ఇప్పుడు జరగాల్సింది వారి అభివృద్ది అని అన్నారు. వారికి ఏ రకంగా న్యాయం చేస్తామో ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు.