విద్యుత్‌శాఖలోని ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌లలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ దశలవారీగా క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. విద్యుత్ ఉద్యోగ సంఘాలు సమ్మె పిలుపును ఉపసంహరించుకొని చర్చలకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని, సమ్మె పిలుపును ఉపసంహరించుకోవాలని కోరారు. సమ్మె ఉపసంహరణ ప్రకటన వచ్చిన వెంటనే ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు పిలువాలని మంత్రి జగదీశ్‌రెడ్డిని సీఎం ఆదేశించారు. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని మంత్రికి సూచించారు. విద్యుత్‌శాఖ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై సీఎం కేసీఆర్ గురువారంనాడు ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి, విద్యుత్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సీఎంఓ అదనపు ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
దశలవారీగా క్రమబద్ధీకరణ




