దాచేపల్లి తరహాలో మరో ఘటన
చిన్నారిపై అత్యాచారం..ఆస్పత్రిలో చికిత్స
గుంటూరు,మే7(జనం సాక్షి): దాచేపల్లి ఘటనను మరువకముందే జిల్లాలో మరో దారుణం వెలుగు చూసింది. ఓ వైపు ఆందోళనలు జరుగుతున్న నేపథ్యలంఓ మరో అమాయక బాలికపై అత్యాచారినికి ఒడిగ్టటారు. చుండూరు మండల పరిధిలోని ఓ గ్రామంలో ఏడేళ్ల చిన్నారిపై నాగూల్ విూరా అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధిత చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితమే ఈ ఘటన జరిగిందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వైద్య పరీక్షల కోసం బాధిత చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.