దాచేపల్లి ఘటనపై రోజా రాజకీయం

మండిపడ్డ ఎమ్మెల్యే అనిత
విజయవాడ,మే7(జ‌నం సాక్షి):  దాచేపల్లి ఘటనను విపక్షాలు రాజకీయం చేయటం బాధాకరమని టీడీపీ ఎమ్మెల్యే అనిత అన్నారు. రోజాకు మతిభ్రమించి..ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…రోజా ప్రజాప్రతినిధి అన్న విషయం మర్చిపోవద్దన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు తగ్గాయన్నారు. సామాజిక బాధ్యతగా ఆడపిల్లల రక్షణ కోసం సీఎం ర్యాలీలో పాల్గొంటున్నారని, విూకు బాధ్యత ఉంటే ర్యాలీలో పాల్గొనండని ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యానించారు.

తాజావార్తలు