Wednesday, 4 November 2026

ఏఈఈ ఆన్ లైన్ పరీక్ష..

j4h2n7ur

హైదరాబాద్ : మరికాసేపట్లో టీఎస్పీఎస్సీ నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టులకు పరీక్ష జరగనుంది. టీఎస్ పీఎస్ సీ ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షకు మొత్తం 99 సెంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 75, కరీంనగర్‌ 4,ఖమ్మంలో 6, వరంగల్‌లో 14 సెంటర్లు ఏర్పాటు చేసారు. ఆన్‌లైన్‌ ద్వారానే ఏఈఈ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 30వేల 783 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరవుతున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30నిముషాల వరకు జనరల్‌ స్టడీస్‌, మధ్యాహ్నం 2.30 నిముషాల నుంచి సాయంత్రం 5వరకు సివిల్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష జరగనుంది. ఎలాంటి అవకతవకలు జరుగకుండా పరీక్షకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు టీఎస్ పీఎస్ సీ సభ్యులు తెలిపారు.
వరంగల్ ..
జిల్లాలో మొత్తం 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2860 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. 8.30 గంటలకు అభ్యర్థులను పరీక్షాకేంద్రంలోకి అనుమతిస్తున్నారు. 29 మంది ప్రత్యేకస్క్వాడ్స్… అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అభ్యర్థులకు కొన్ని సూచనలు చేశారు. బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నారు. అంధులకు అదనంగా మరో 20 నిమిషాల సమయాన్ని కేటాయించారు. 20 మందికి ఒక ఇన్విజిలేటర్ తనిఖీ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *