అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి
జలసౌధలో ఎన్.ఎస్.పీ లిప్ట్ ఇరిగేషన్ పై మంత్రి హరీష్ రావు సవిూక్ష
హైదరాబాద్,మే30(జనం సాక్షి): దిండి ఎత్తిపోతల పథకం లోభాగమయిన గొట్టి ముక్కల రిజర్వాయర్ ద్వారా తొలి ఫలాలు రైతులకు అందేలా చూడాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌ఆర్ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని, కాలువల పనులను అక్టోబర్ – నవంబర్ లోగా పూర్తి చేసేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు.మిర్యాలగూడ నియోజకవర్గంలోని దున్నపోతుల గండి, నూతన పాలెం, కేశవాపురం లిప్ట్ ఇరిగేషన్ స్కీంలకు సంబంధించి టెయిల్ ఎండ్ ఆయకట్టును స్థిరీకరించే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ట్రైబల్ సబ్ ప్లాన్ కింద పనులు చేసే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు డిస్టిబ్యూట్రరీ హైలెవల్ కెనాల్ -8 , 9 లో 23 కిలోవిూటర్ల తర్వాత దాదాపు ఎనిమిది వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందని అధికారులు ఈ సవిూక్షలో మంత్రి హరీష్ రావుకు తెలిపారు. చలకుర్తి లిప్ట్ ఇరిగేషన్ ద్వారా 2 వేల ఎకరాల ఆయకట్టుకు డీప్ కట్ ఉండటం ద్వారా నీటి పంపింగ్‌లో అంతరాయం కలుగుతోందని వివరించారు. దీన్ని అధిగమించేందుకు లోలెవల్ కెనాల్ పంప్ హౌస్ లోని మూడు పంపుల్లో… ప్రత్యామ్నాయంగా ఉన్న పంపు ఉపయోగించి డి-8,9 కు అనుసంధానం చేసేలా ప్రతిపాదనలు పంపాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఎన్. ఎస్. పీ పుట్టంగండి నుంచి అక్కంపెల్లి బాలెన్సింగ్ రిజర్వాయర్ కు గల 9.3 కిలోవిూటర్ల లింక్ కెనాల్, అక్కడి నుంచి కోదండాపూర్ రిజర్వాయర్ వరకు గల 2 కిలోవిూటర్ల వరకు నిరంతరం హైదరాబాద్‌కు పంపింగ్ స్కీం ద్వారా తాగు నీరు అందిస్తున్నారని.. ఇది నిరంతరం జరగడం వల్ల కెనాల్ కోతకు గురవుతుందని అధికారులు మంత్రికి తెలిపారు. కెనాల్ వెంబడి ఉన్న రోడ్డు కోతకు గురయి తరచు ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని మంత్రి హరీష్ రావు దృష్టికి తెచ్చారు. ఈ సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు లైనింగ్ పనులు చెపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో పాటు ఎ.ఎమ్. ఆర్. పీ కెనాల్ లైనింగ్ ఉదయసముద్రం కింది వరకు ఉండేలా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులకు సూచించారు. ఈ సవిూక్షలో నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు,ఈఎన్ సీ మురళీధర్, ఎన్. ఎస్. పీ. సీఈ ఎస్. సునీల్, ఎన్. ఎస్. పీ ఎస్. ఈ నర్సింహం, దిండి లిప్ట్ ఇరిగేషన్ ఎస్. ఈ వెంకటేశం, ఈఈలు పాల్గొన్నారు.
—–
దిండి ఎత్తిపోతల పథకం తొలి ఫలాలు రైతులకు అందాలి




