హైదరాబాద్,మే23(జనం సాక్షి): కొండెక్కిన కోడి ధరలు ఎండాకాలం కారణంగా దిగి రావడం లేదు. వర్షాలు మొదలయితే తప్ప ధరలు దిగి రావని మార్కెట్‌లో అమ్మకం దార్లు అంటున్నారు. ఉత్పత్తి తగ్గడం వల్లనే ధరలు పెరిగాయన్నారు. ముఖ్యంగా పెండ్లిలు, ఇతర శుభకార్యాల సీజన్ కావడంతో డిమాండ్ ఏర్పడింది. అయితే సీజన్ మారినా ధరలు మాత్రం దిగలేదు. కోడిమాంసం విక్రయించే ¬ల్‌సేల్ దుకాణాల్లో కూడా ధరలు ఇంచుమించుగా అలాగే ఉన్నాయి. బాయిలర్ చికెన్ ధర రూ.180కి చేరుకుంది. నెల రోజుల క్రితం చికెన్ ధర రూ.140 నుంచి రూ.150 పలికింది. ప్రస్తుతం లైవ్ కోడి ధర కిలో రూ.120, స్కిన్‌లెస్ రూ.180, స్కిన్ రూ.170 పలుకుతోంది. ఈ లెక్కన రూ.30 మేర పెరిగింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఆ ప్ర భావం పౌల్టీ పరిశ్రమపై పడింది. వేడిమిని తట్టుకోలేక కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గుడ్ల ఉత్పత్తి కూడా తగ్గుతోంది. దీంతో ధరలు అమాంతం పెరుగుతు న్నాయని వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన ధరల కారణంగా వ్యాపారం దెబ్బతింటున్నదని పలువురు వ్యాపారులు అంటున్నారు. గతంలో ఒక దుకాణంలో సగటున 50 కిలోల వరకు చికెన్ విక్రయాలు జరిగేవి. ఇప్పుడు 30 నుంచి 35కిలోలు మాత్రమే విక్రయి స్తున్నామని దుకాణదారులు వాపోతున్నారు.
దిగిరాని చికెన్ ధరలు




