Sunday, 8 November 2026

దివ్యాంగులకు ఇసి వాహన సౌకర్యం

హైదరాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి):దివ్యాంగులందరూ ఓటు వేసేలా ఎన్నికల సంఘం వాహన సౌకర్యం కల్పిస్తున్నది. వారిని పోలింగ్‌ బూత్‌కు తీసుకువచ్చి ఓటు వేసిన తర్వాత ఇంటికి చేర్చడానికి వాహనాలు సమకూర్చుతున్నది. హైదరాబాద్‌ జిల్లాలోని 18 వేల మంది దివ్యాంగులు ఓటింగ్‌లో పాల్గొనేలా జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్‌ విస్తృత ఏర్పాట్లు చేశారు. వాహన సౌకర్యం కోసం ఓటరు అక్సెబులిటీ యాప్‌ ఫర్‌ డిఫరెంట్లీ ఏబుల్‌(వాదా) యాప్‌ను రూపొందించారు. యాప్‌లో వాయిస్‌ మెసెజ్‌ ద్వారా చిరునామా, పోలింగ్‌ కేంద్రం, బయలుదేరే సమయాన్ని తెలియజేస్తే వారి ఇంటికి వాహనాన్ని పంపిస్తారు. జిల్లాలోని 1,019 పోలింగ్‌ లొకేషన్లలో ఉండే ప్రతి వాహనానికి ఒక ప్రత్యేక అధికారి ఉంటారు. యాప్‌లో తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషలు పొందుపరిచారు.