హైదరాబాద్,నవంబర్26(జనంసాక్షి): ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే వారిపై సైబరాబాద్ పోలీసుల వాట్సాప్ నెం.9490617444కు సమాచారం ఇవ్వాలని కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ఓటింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు పెరిగే అవకాశం ముందని, ప్రజలు వీటిపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా ఎన్నికల కమిషన్ యాప్ కు తెలియజేయాలన్నారు. అక్రమంగా డబ్బు సరఫరా పై సమాచారం ఉంటే వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చు. సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎవర్నీ వదిలిపెట్టేది లేదని, ఓటర్లకు పూర్తి స్వేచ్ఛ వాతావరణాన్ని కల్పిస్తామన్నారు.




