Thursday, 5 November 2026

దుర్గగుడి ఇవోగా కోటేశ్వరమ్మ బాధ్యతలు

విజయవాడ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): విజయవాడ దుర్గ గుడి ఈవోగా కోటేశ్వరమ్మ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. దేవాలయానికి విచ్చేసిన ఆమెకు దేవస్థానం సిబ్బంది ఘనస్వాగతం పలికారు. కాగా… ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవలే ఆమెను ఇవోగా నియమించారు. గతంలో పనిచేసిన ఇవో పద్మావతి చీర మాయం కారణంగా బదిలీ అయ్యారు.