Tuesday, 3 November 2026

దుష్టశక్తులను దునుమాడుదాం అన్న కవిత

ట్విట్టర్‌ వేదికగా బాలికా దినోత్సవ సందేశం

హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): దుష్టశక్తుల చర్యలను దేశం నుంచి అంతం చేద్దామని జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా నిజామాబాద్‌ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. పోషకాహారలేమి, విద్య అందక పోవడంతో పాటు లైంగిక దాడులు దేశ కూతుళ్లపై ఇంకా కొనసాగుతూ.. వారిని బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దుష్ట శక్తుల అంతానికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పుడే దేశం నిజమైన ప్రగతివైపు పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దుష్ట శక్తుల అంతానికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడు మాత్రమే దేశం నిజమైన ప్రగతివైపు పయనిస్తుందన్నారు.