హైదరాబాద్ (జనంసాక్షి) : హైదరాబాద్,రంగారెడ్డి,మహబూబ్ నగర్ ఎమ్మెల్సీగా దేవీప్రసాద్ గెలుపు లాంఛనమేనన్నారు రాష్ట్ర మంత్రులు. దేవీ ప్రసాద్ భారీ మెజార్టీతో గెలవబోతున్నరని చెప్పారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న దేవీప్రసాద్ విజయానికి అందరూ సహకరించాలని కోరారు. ఎమ్మెల్సీ స్థానానికి దేవీప్రసాద్ నామినేషన్ వేశారు. అంతకుముందు గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళలు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లిన దేవీప్రసాద్ జీహెచ్ఎంసీ ఆఫీసులో నామినేషన్ ను సమర్పించారు.




