తాండూరు సెప్టెంబర్ 17(జనం సాక్షి) యాలాల మండలం దేవనూర్ గ్రామంలోని శివాలయ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్టించారు. ఐదు రోజులపాటు వినాయకునికి అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. ప్రతిరోజు రాత్రి భజనలు ,సంకీర్తనలతో గ్రామం మారుమోగింది. అయితే ఐదు రోజుల పాటు పూజలు అందుకున్న వినాయక లడ్డును ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అదే గ్రామానికి చెందిన లింగమంతుల సంగమేశ్వర్ పదివేల కు లడ్డును తన సొంతం చేసుకున్నాడు .ఈ సందర్భంగా లింగమంతుల సంగమేశ్వర్( జనం సాక్షి )మీడియాతో మాట్లాడుతూ శివాలయంలో ప్రతిష్టించిన వినాయకుని దగ్గర ఉన్న లడ్డూను కొంటేకుటుంబంలో మంచి జరుగుతుందని ,నమ్మకం తో మహా దేవుని ప్రసాదాన్ని కైవసం చేసుకున్నట్లు పేర్కొన్నారు . ఐదు రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న వినాయక లడ్డు దొరకడం సంతోషకరమన్నారు. విఘ్నాలు తొలగి విజయాలు చేకూరాలని మనసారా వేడుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. అనంతరం వినాయకుని గ్రామంలో ఊరేగింపుగా వెళుతూ భజనలు ,భక్తి పాటలు సంకీర్తనలతో ముందుకు సాగారు. ఉదయం నుండి సాయంత్రం వరకు గ్రామంలో ఊరేగింపు అత్యంత వైభవంగా ,కన్నుల పండుగగానిర్వహించారు .అనంతరం గ్రామ సమీపంలోని ఉప్పు చెరువులో వినాయకుడిని గంగమ్మ ఒడికి సాగనంపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని చివరిసారిగా గణనాథుని వేడుకున్నారు. ఈ నిమజ్జన కార్యక్రమం లో గ్రామానికి చెందిన పెద్దలు లింగమంతుల రాములు, లింగమంతుల రామలింగం లింగమంతుల నాగలింగం, లింగమంతుల బసవరాజ్ లింగమంతుల సంగమేశ్వర్ శ్రీనివాస్ శంకర్, అంజనేయులు, ఈశ్వరప్ప కే వెంకటయ్య, ఎం గోపాల్ రాజు, మహేష్, చింతల దిండి రాజేందర్ గౌడ్ ,వెంకటయ్య గౌడ్ తో పాటు గ్రామాని చెందిన పలువురు పాల్గొన్నారు
దేవునూర్ వినాయక లడ్డును కైవసం చేకున్నసంగమేశ్వర్




