Wednesday, 4 November 2026

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో….. తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం

 బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ తాండూర్ సెప్టెంబర్16( జనం సాక్షి) రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తాం అని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ అన్నారు. శనివారం చలో పాలమూరు కార్యక్రమంలో భాగంగా సుమారు 100 వాహనాలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తు పాలమూరు కు బయలుదేరి వెళ్లారు .ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణలో తెరాస కి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు  . కెసిఆర్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం అని అన్నారు. చెప్పిన ఆ మీల్ అన్ని నెరవేర్చకపోవడం తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపివైపు పవస గా లులువీస్తున్నాయనీ  సంతోషం వ్యక్తం చేశారు్ రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం  చెబుతామని అన్నారు.  పేదలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తాండూరులో బీజేపీ జెండా ఎగురవేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూజారి పాండు, బంటారం భద్రేశ్వర్ ,అంజలి తో పాటు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.