Tuesday, 3 November 2026

దేశంలో సామ్రాజ్యవాద హిందూ ఫాసిస్టు శక్తులు చేతులు కలిపాయి

C
– జస్టిస్‌ చంద్రకూమార్‌

– ముస్లింలు, దళితులు అభద్రతలో ఉన్నారు

– హిందూ మతోన్మాద వ్యతిరేక సభలో వరవరరావు

హైదరాబాద్‌,డిసెంబర్‌4(జనంసాక్షి):సామాజ్య వాద శక్తులతో ఫాసిస్టు శక్తులు చేతులు కలుపుతున్నాయని ఈ ప్రయత్నాలను దళిత, మైనార్టీ సంఘాలు సమైక్యంగా ప్రతిఘటించాలని జస్టిస్‌ చంద్రకుమార్‌ పిలుపునిచ్చారు.హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హిందూ మతోన్మాద వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరం అభినవ్‌ అధ్యక్షతన హిందూ మతోన్మాదం నశించాలి పేరిట గాంధీభవన్‌ లో బహిరంగ సభ జరిగింది.  ఈ సదస్సుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో హిందూ మతోన్మాద శక్తుల ఆగడాలు పెరిగిపోయాయని, దేశంలో అసహనం నెలకొందని చెప్పారు. గాంధీ హంతకులు దేశంలో అరాచకాలు సృష్టిస్తున్నారని తెలిపారు. దేశం మతతత్వ ప్రమాదంలో కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ మతమూ ఇతర మతాలపై దాడి చేయాలని కోరుకోదని ఆయన తెలిపారు. ఈ సభకు హాజరైన విప్లవ విప్లవ రచయిత సంఘం నాయకుడు వరవరరావు మాట్లాడుతూ బారత్‌ దేశంలో హిందూ ఫాసిస్టు ప్రమాదం రోజు రోజుకు పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మత పరమైన దాడులు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ ప్రపంచీకరణ మొదలైన 1991 తర్వాత అవి వ్యవస్తీకరించబడ్డాయని అన్నారు. దేశంలో దళిత, ముస్లీంలు అభద్రతా భావంతో బతుకుతున్నారని ఆయన తెలిపారు. మతలపరమైన హింస, దాడుల గురించి మాట్లాడితే పాకిస్తాన్‌, అరబ్‌ దేశాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావని కొంత మంది ప్రశ్నిస్తుంటారని వరవరరావు తెలిపారు. అయితే భారత దేశ రాజ్యాంగం తనకు తాను లౌకిక, ప్రజాస్వామిక రాజ్యాంగంగా ప్రకటించుకుందని ఆయన తెలిపారు. దేశంలో మతోన్మాదులు తిండి, కట్టుబాట్లపై ఆంక్షలు విధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపరమైన దాడులను కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు ఇరత మతాలపై జరుగుతున్న దాడులను ప్రోత్సహించడం దారుణమని చెప్పారు. ఈ సమావేశంలో చాడా వెంకటరెడ్డి, కరకరాల, వివిధ ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

సెక్యులరిజాన్ని కాపాడాలి:తమ్మినేని

దేశంలో సెక్యులరిజాన్ని కాపాడేందుకు అన్ని పార్టీలూ కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. దేశంలో లౌకిక వాదాన్ని నెలకొల్పేందుకు అంబేద్కర్‌ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. దేశంలో పెచ్చువిూరుతున్న మతతత్వం, కాషాయీకరణ అంశాలపై ఈ సదస్సుకు జస్టిస్‌ చంద్రకుమార్‌, తదితర నేతలు హాజరయ్యారు. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ

దేశాభివృద్ధికి విధానాలు విఘాతం..

బిజెపి అవలంబిస్తున్న విధానాలు దేశాభివృద్ధికి విఘాతంగా మారాయని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. మోడీ గుప్పించిన ఇబ్బడి ముబ్బడి వాగ్దానాలను నమ్మిన ప్రజలు ఓట్లేశారే తప్ప బిజేపినో లేక హిందుత్వాన్నో చూసి కాదని అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం దేశంలో ప్రమాదకరమైన మతోన్మాదాన్ని ప్రవేశపెడుతున్నారని అభిప్రాయపడ్డారు. ప్రమాదకరమైన ఈ తరహా విధానాలకు వ్యతిరేకంగా అన్ని శక్తులూ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.

ముదురుపాకాన పడుతున్న మతపిచ్చి..

భారతదేశంలో మతపిచ్చి ముదురు పాకాన పడుతోందని సిపిఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. బిజెపి ఎంపిలు, మంత్రులు ఇష్టానుసారంగా స్టేట్‌మెంట్లు ఇస్తూ అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు. మతతత్వం మూలంగా దేశ ప్రగతి కుంటుబడుతుందని, దేశానికి రావాల్సిన పెట్టుబడులు సైతం నిలిచిపోతాయని వక్తలు అభిప్రాయపడ్డారు. అత్యంత ప్రమాదకరంగా మారిన బిజెపి కాషాయీకరణ విధానాన్ని సంయుక్తంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *