Thursday, 5 November 2026

దేశమంతా రైతు పథకాలను ఫాలో కావాల్సిందే

తెలంగాణ పథకాలతో రైతులకు భరోసా దక్కినట్లే
గుత్తా సుఖేదర్‌ రెడ్డి
హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): దేశంలో మొట్టమొదటిసారిగా రైతుబంధు పథకం చరిత్రలో నిలిచిపోతుందని రైతు సమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంకురార్పణ చేశారని కొనియాడారు. ఈ పథకం దేశాన్ని అమితంగా ఆకర్షిస్తున్నదన్నారు. రానున్న రోజుల్లో ప్రతి రాష్ట్రం కూడా తెలంగాణలో అమలవుతున్న రైతు పథకాలను ఫాలోకాక తప్పదన్నారు.  రైతుల భూరికార్డులను నవీకరించి, సాగు రైతులందరికీ పంటకు ముందస్తు పెట్టుబడిగా ఎకరానికి 4వేలు  అందించే రైతుబంధు పథకంతో బంగారు తెలంగాణకు బాటలు పడ్తాయని అన్నారు. ఈనెల 10నుంచి 17వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న రైతుబంధు చెక్కుల పంపిణీ, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ తెలంగాణలో కొత్త చరిత్రకు నాంది పలకబోతున్నదని అన్నారు.
పాస్‌బుక్‌ తాకట్టుపెట్టి బ్యాంకు రుణం తీసుకోవాల్సిన అవసరం లేకుండా కెసిఆర్‌ చేశారు. రైతుబంధు పథకం కింద లభించే పెట్టుబడి సాయాన్ని స్వచ్ఛందంగా వదులుకునే పెద్దరైతులు, ప్రజాప్రతినిధులకు ముందుగా చెక్కు లు అందజేసి, అనంతరం వారి వద్ద నుంచి చెక్కులు తీసుకొని వారి నిధులను తిరిగి రైతు సమన్వయ సమితి ఖాతాలో జమచేస్తాం. ఆ నిధులను రైతుల సంక్షేమం కోసం వినియోగిస్తామని అన్నారు.  వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సాగునీరు, 24 గంటల విద్యుత్‌ కల్పించడంతోపాటు ఏడాదికి ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు. రైతుబంధు, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రైతులు, స్థానిక ప్రజలు పెద్దఎత్తున హాజరై విజయవంతం
రైతులకు ఖచ్చింతంగా మేలు చేసే పథకం