డొక్కా సంచలన వ్యాఖ్యలు
గుంటూరు,జూన్4(జనం సాక్షి): దేశానికి బిజెపి అవసరం లేదని మాజీమంత్రి,టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపితో దేశానికి లాభం లేదని తేలిపోయిందన్నారుబిజెపి ఎపికే కాదు.. దేశానికే అనవసరమని డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ.. సిఎం శ్రమను కేంద్రం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బిజెపి విలువలను తుంగలో తొక్కి రాష్ట్రాల హక్కులను హరిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు కృషివల్లే ఎపికి పెట్టుబడుల వరద వస్తోందని డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. వైసిపి, జనసేనకు కేంద్రాన్ని నిలదీసే దమ్ములేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబును, లోకేష్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. వైసిపి, జనసేన దగాకోరు పార్టీలని డొక్కామాణిక్యవరప్రసాద్ దుయ్యబట్టారు




