Tuesday, 3 November 2026

దేశ భవష్యత్తుకు మోడీ పాలనకు తిరుగులేదు.సాకటి దశరథ్. జనంసాక్షి బోథ్ :దేశ ప్రధాని

నరేంద్ర మోడీ  నాయకత్వంలో భారతీయజనతా పార్టీ పాలనకు 8 వసంతాలు పూర్తయిన శుభసందర్భం గా  సాధించిన విజయాలు,గడప గడపకు వెళ్లి  ప్రజలకు పేదలకు చేసిన మేలును అందరికి తెలిసేలా కరపత్రాలతో  బీజేపీ – గడప గడపకు నరేంద్రమోడీ కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు సాకటి దశరథ్ తెలిపారు.అందులో భాగంగానే సోమవారం బోథ్ మండలంలోని పలు గ్రామాలలో  బీజేపీ నాయకులు విస్తృత ప్రచారం చేసారు.
బోథ్ నియోజక వర్గంలోని.. దన్నూర్(బి), దన్నూర్ (k), బిర్లాగొంది, కండి పళ్లి, అందుర్, నారాయణ్ పూర్ గ్రామాలలో జరిగిన కార్యక్రమాలలో రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి,మరియు మండల నాయకులు పాల్గొన్నారు.