బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. దౌల్తాబాద్ జూన్ 13, జనం సాక్షి

దౌల్తాబాద్ మండలంలో ఇందుప్రియల్ గ్రామంలో ఆదివారం రోజున ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తో మృతి చెందిన ప్రవీణ్ మృతదేహాన్ని గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్ చూసి తన తండ్రి అయిన యాదయ్య ను ఓదార్చారు. ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వపరంగా కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు . తక్షణ సాయంగా ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమం లో దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్,జిల్లా కోఆప్షన్ రహిమోద్దిన్,పిఎసిఎస్ చైర్మన్ వెంకట రెడ్డి,గ్రామ సర్పంచ్ శ్యామల కుమార్, ఎంపీటీసీ మల్లేశం,మండల యువత అధ్యక్షులు నర్ర రాజేందర్, తెరాస నాయకులు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు