Tuesday, 3 November 2026

దేశ రక్షణ అవసరాలకు అత్యంత ప్రాధాన్యం : పారికర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 : దేశరక్షణ అవసరాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ స్పష్టం చేశారు. శనివారం నగరంలో జరిగిన దేశీయ ఆయుధాలు, రక్షణ ఉత్పత్తుల తయారీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సమృద్ధితో ఆయుధ సంపత్తి సమకూర్చుకోవడం అవసరమని తెలిపారు. మన రక్షణ రంగం ఇతర దేశాలకంటే భిన్నంగా ఉందని కేంద్రమంత్రి పారికర్‌ వెల్లడించారు. ఈ సదస్సులో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఆయుధాల ఉత్పత్తిలో స్వయం సమృధ్దిపై ఈ సమావేశంలో చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *