Tuesday, 3 November 2026

పోలీసులు అమానుషంగా వ్య‌వ‌హ‌రించారు – పొన్నాల కంట తడి

glzxkdfxహైదరాబాద్ :త‌న‌పై పోలీసులు అమానుషంగా వ్య‌వ‌హ‌రించారు అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శనివారం కంటతడి పెట్టారు. పోలీసులు తనపట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళితే సచివాలయాన్ని ఎర్రగడ్డకు… చెస్ట్ ఆసుపత్రిని అనంతగిరికి తరలించాలని కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం గాంధీభవన్ నుంచి రాజ్ భవన్ వరకూ పాదయాత్ర తలపెట్టారు. అయితే పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు.

అయినా కాంగ్రెస్ నేతలు పాదయాత్రకు బయల్దేరగా, పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ సమయంలో పోలీసులకు, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది.  దాంతో పొన్నాల కింద పడిపోయారు.  ఆయన భుజానికి తీవ్ర గాయమైంది. పొన్నాల భుజం ఎముక పక్కకు జరిగింది.

అయినా పోలీసులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ పొన్నాల కన్నీళ్లు పెట్టుకున్నారు.  పోలీసులు అక్కడకు చేరుకుని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా ఆయన నిరాకరించారు.  ఆ సమయంలో అక్కడే ఉన్న జానారెడ్డి ఆయన్ని ఓదార్చి, చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు గోషామహల్ పోలీస్ స్టేషన్ వద్ద పలువురు కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అరెస్ట్ చేసిన నాయకులను, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ నేతల అరెస్ట్ను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు రాజ్భవన్ ముట్టడించేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని అక్కడ నుంచి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *