దౌల్తాబాద్ మోడల్ కళాశాల లో సెకండియర్ లో 98% శాతం ఉత్తీర్ణత.
మండల కేంద్రంలోని మోడల్ కలశాలలో మొదటి,రెండవ సంవత్సర ఫలితాలలో మొదటి సంవత్సరంలో లో 86% శాతం, రెండవ సంవత్సరం లో 98% ఉత్తీర్ణత సాధించారు. మోడల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం మొదటి సంవత్సరంలో ఎంపీసీ మద్ది అఖిల 458/ 470,బైపిసి వడ్లకొండ యశ్వంత్ 402/440, సిఇసి గుండెకాయ సాయికిరణ్ 429 / 500 మొదటి స్థానంలో నిలిచారు. రెండవ సంవత్సరంలో ఎంపీసీ పెరమండ్ల యాకోబు 954 /1000, బైపిసి గాడి హర్ష 941 /1000,సి ఇ సి న్యాలపల్లి పూజిత 809 / 1000 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారని తెలిపారు. మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సురేందర్ రెడ్డి తెలిపిన ప్రకారం కళాశాలలో మొదటి సంవత్సరం లో 77.5%,రెండవ సంవత్సరం లో 84.5% ఉత్తీర్ణత శాతం పాసయ్యారు అని తెలిపారు.