హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లడగం
వాటర్‌గ్రిడ్, రోడ్ల అభివృద్ధికి అధిక నిధులు
రానున్న రోజుల్లో కరెంటు సమస్యను అధిగమిస్తాం
సీఎం కేసీఆర్
హైదరాబాద్, నవంబర్ 28 (జనంసాక్షి) : తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లుకు శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. శుక్రవారం సభలో బిల్లుపై విపక్ష సభ్యులు లేవనెత్తిన అనుమానాలపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చిన తరువాత, సంతృప్తి చెందిన విపక్షాలు ద్రవ్య వినిమయ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. ద్రవ్య వినిమయ బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, వైసీపీ, సీపీఎం మద్దతు తెలిపాయి. హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేకర్‌రావు ప్రకటించారు. వాటర్‌గ్రిడ్, రోడ్ల అభివృద్ధికి అధిక నిధులు ఖర్చుచేస్తామన్నారు. రానున్న రోజుల్లో కరెంటు సమస్యను అధిగమిస్తామని పునరుద్ఘాటించారు. శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని ప్రతిపక్ష నేత జానారెడ్డి తెలిపారు. శాసనసభలో ఆయన ప్రసంగిస్తూ, విప్‌ను పక్కన పెట్టి బడ్జెట్‌ను బలపరుస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధికి తామెప్పుడూ ఆటంకం కాదని.. కొత్తగా ఏర్పడిన రాష్టాన్న్రి అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని సూచించారు. శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును సమర్థిస్తున్నట్టు బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ స్పష్టంచేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆత్మ విశ్వాసాన్ని అభినందిస్తున్నామన్నారు. తాము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చెప్పామని..అలాగే వ్యవహరిస్తామని వెల్లడించారు. బంగారు తెలంగాణ కోసం రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో సంప్రదింపులు జరుపాలని సూచించారు.
రాష్ట్ర ఆర్ధిక పరిపుష్టికి మరికొంత సమయం అవసరం
‘రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఎటువంటి అనుమానాలు వద్దు. ఆర్ధిక పరిపుష్టికి మరికొంత సమయం పడుతుంది. కేంద్రంలో ప్రభుత్వ ప్రాధాన్యాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తుంది. ఆర్ధిక క్రమశిక్షణతో, చిత్తశుద్దితో కష్ట పడి పని చేస్తాం. రాజకీయ పక్షాలు తగిన సహకారం అందించాలి” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పిన తరువాత ముఖ్యమంత్రి సభకు సమాధానం చెప్పారు. చర్చలో పాల్గొన్న సభ్యులకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కొత్తరాష్ట్రం, కొత్త లెక్కలు, అధికారులు లేని లోటు ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అధికారులను కేటాయించాలని కేంద్రానికి ఎన్నిసార్లు కోరినా,ఇప్పటికీ కేటాయించలేదని ఆరోపించారు. ఒక్కో అధికారి ఆరేడు శాఖలు చూస్తున్నారని సీఎం తెలిపారు. ఇప్పటికీ ఇంకా కొన్ని లెక్కలు తేలలేదని పేర్కొన్నారు. ఫైనాన్స్ కమిషన్ ఆదేశాల ప్రకారమే గ్రాంట్స్ వస్తున్నాయని తెలిపారు. రాబోయే పంచవర్ష ప్రణాళికలో రాష్ట్ర జనాభా, పరిస్థితులను బట్టి గ్రాంట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. జూన్2, 2014 మిగులు నిల్వ కింద రూ. 2,544 కోట్లు తెలంగాణకు వచ్చిందని ప్రకటించారు. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ రూ. 35,378 కోట్లు ఉందన్నారు. ఇంకో 5 వేల కోట్ల ఎఫ్ఆర్బీఎం రిజర్వ్‌బ్యాంక్‌లో నిల్వ ఉందన్నారు. ఆ నిధులను ప్రభుత్వం ఎప్పుడైనా వాడుకోవచ్చన్నారు. రాష్ట్ర పన్నుల కింద రెవెన్యూ రూ. 15101.97 కోట్లు ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం గత పాలసీలలో మార్పులు తెస్తున్నదని పేర్కొన్నారు.పన్నేతర ఆదాయం 1,273 కోట్లు, సెంట్రల్ ట్యాక్స్ రెవెన్యూ 3,969 కోట్లు, కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు 2,514 కోట్లు, మొత్తం అప్పులు 2,800 కోట్లు, ఇతరములు 288.19 కోట్లు ఉందని ముఖ్యమంత్రి సభకు వివరించారు. ఈ ఆరు నెలల్లో రాష్టాన్రికి వచ్చిన మొత్తం ఆదాయం 25,947.97 కోట్లుగా ఉందన్నారు. వచ్చే ఏడాది బడ్జెట్లో పూర్తి క్లారిటీ ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లోపు ప్రధానిని కలిసి కేటాయింపులపై చర్చిస్తామన్నారు. కొత్త రాష్ట్రం కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. పూర్తిస్థాయిలో నిలదొక్కుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఇప్పటికే ఎఫ్ఆర్బీఎం లెక్కలు సమర్పించామని పేర్కొన్నారు. గతంలో తీసుకున్న అప్పులకు ప్రభుత్వం చెల్లింపులు జరుపుతుందని చెప్పారు. చెరువుల పునరుద్ధరణ, వాటర్ గ్రిడ్ కోసం భారీగా నిధులు కేటాయించామని తెలిపారు. ఎస్వోటీఆర్, ఎస్‌వోఆర్ విూద 90 శాతం లోన్ తీసుకోవచ్చన్న విషయాన్ని గుర్తు చేశారు. రిజర్వ్ బ్యాంక్‌కు కట్టాల్సిన అప్పు రూ. 20 వేల కోట్లు ఉందని పేర్కొన్నారు. 45 వేల చెరువుల పునరుద్ధరణకు రూ. 25 నుంచి 35 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. బడ్జెట్ మేనేజ్మెంట్ ఉండాలనే కొన్ని పరిమితులు విధించినమని పేర్కొన్నారు. రాష్ట్రం తెచ్చే అప్పులపై కేంద్రం నియంత్రణ ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయలేదని, ప్రభుత్వం వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. హైదరాబాద్ చుట్టూ వెయ్యి ఎకరాల్లో పాలీహౌస్ నిర్మాణం చేపడుతున్నాయని తెలిపారు. పాలీహౌస్ కోసం నేషనల్ హార్టీకల్చర్ బోర్డు సహాయం కోరామన్నారు. రైతులకు మద్దతు ట=ర ఇప్పించేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం రూ. 400 కోట్లు కేటాయించామన్నారు. ప్రైవేటు డెయిరీ కుట్రలతో విజయ డెయిరీ దెబ్బతిందని చెప్పారు. గతంల ఎన్నడూ లేని విధంగా లీటర్ పాలకు రూ. 4 ప్రోత్సాహకం ఇస్తున్నామని పేర్కొన్నారు. పౌల్టీ రంగాన్ని ప్రోత్సహించడానికి 20 కోట్లు కేటాయించామన్నారు. పెన్షన్, రేషన్ కార్డుల్లో కోతలు పెట్టలేదని తెలిపారు. పెన్షన్ల కోసం 1900 కోట్లు కేటాయించామని, అయినా అవి సరిపోవని చెప్పారు. ప్రతీ బడ్జెట్లో పెన్షన్ల కోసం రూ. 3600 నుంచి 4 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. నాలుగేళ్లు పూర్తయ్యేలోపు తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్‌తో ప్రతి ఇంటికీ నల్లా నీరందిస్తామని ప్రకటించారు. వాటర్ గ్రిడ్ నిధుల కోసం ప్రధానిని కలవబోతున్నామని తెలిపారు. 2018 ముగిసేలోపు ప్రతి ఇంటికి నల్లా నీరు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని ప్రకటించారు. మాకు చిత్తశుద్ధి ఉంది… మేం కష్టపడుతామని ధీమా వ్యక్తంచేశారు. రహదారుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. పంచాయితీరాజ్‌లో రూ. 700 కోట్ల బకాయిలు
చెల్లించడం జరిగిందన్నారు. పంచాయితీరాజ్ బీటీ రోడ్స్ 25 వేల కి.విూ వరకు రెన్యూవల్ చేస్తామని ప్రకటించారు. 20 వేల గ్రావిూణ మట్టిరోడ్ల ఆధునీకరణకు రూ. 600 కోట్లు కేటాయించినమన్నారు. 149 మండల కేంద్రాల్లో ఆర్ అండ్ బీ ద్వారా డబుల్ రోడ్లు, గోదావరి, మంజీర, కృష్ణా నదుల విూద బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 411 ఉన్న 108,104 అంబులెన్స్ వాహనాల సంఖ్యను 927కు పెంచినమన్నారు. ఉస్మానియా గాంధీ ఆసుపత్రులకు రూ. 100 కోట్ల చొప్పున కేటాయించినమని తెలిపారు. సుల్తాన్‌బజార్, పేట్ల బురుజు మెరర్నీ ఆసుపత్రులకు రూ. 25 కోట్లు కేటాయించామని చెప్పారు. తెలంగాణ ఉద్యోగులకు రూ. 323 కోట్లతో హెల్త్‌కార్డులు ఇచ్చినట్లు సీఎం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విభజన సమయంలో తెలంగాణ వాటాగా 6వేల మెగావాట్ల థర్మల్ పవర్ కేటాయిస్తే, ప్రస్తుతం 4200 మెగావాట్లే రాష్టాన్రికి వస్తుందని పేర్కొన్నారు. పీపీఏలు రద్దు కావడం వల్ల తెలంగాణ 1600 మెగావాట్లు నష్టపోతుందని తెలిపారు. హైడెల్ పవర్ 2,400 మెగావాట్లు వస్తుందని చెప్పారు. విభజన చట్టం అమల్లోకి వచ్చిన వారం తర్వాత నుంచి కరెంట్ విషయంలో ఆంధ్ర ప్రభుత్వం తొండి మొదలుపెట్టిందని చెప్పారు. కృష్ణపట్నం 650 మె.వా విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే మనకు ఆరు యూనిట్లు కూడా రావడం లేదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి 2700 మెగావాట్ల విద్యుత్ వస్తుందన్నారు. సోలార్‌లో ఇన్వెస్ట్ చేయడానికి 70-80 సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో డబ్బు పుష్కలంగా ఉందన్నారు. ఖజానా క్రమశిక్షణ ఉంటే అప్పులు తొందరగా వస్తయని పేర్కొన్నారు.హైదరాబాద్ నగరంలో షీ టీమ్స్ పని చేస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని, హక్కులను కాపాడుతామని భరోసా ఇచ్చారు. ఒక్కో
నియోజకవర్గంలో 45 లక్షల మొక్కలు నాటుతామన్నారు. రూ. 25 కోట్లతో కొమరంభీమ్ స్మారకం నిర్మిస్తున్నామని తెలిపారు. రూ. 15 కోట్లతో వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటు
చేస్తున్నామని చెప్పారు. గోదావరి పుష్కరాలకు రూ. 100 కోట్లు కేటాయింపు చేశామన్నారు.
యాదగిరి గుట్ట అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాలను
అభివృద్ధి చేస్తామన్నారు. 400 ఎకరాల అటవీభూమిలో యాదగిరి అభయారణ్యం ఏర్పాటు
చేస్తామని తెలిపారు.
బిల్లును వ్యతిరేకిస్తున్నాం : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ద్రవ్య వినిమయ బిల్లును ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై సభలో విపక్ష, అధికార పక్ష సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. బిల్లుపై చర్చకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, సభ్యులంతా సభకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం బడ్జెట్ బిల్లు గవర్నర్ దగ్గరకు పోవాలని, సభ్యులంతా ఇందుకు సహకరించాలని ఆయన పేర్కొన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై ఆయన మాట్లాడుతూ, బ్జడెట్ ప్రతులు చూసి తనకు ఆశ్చర్యమేసిందన్నారు. 4 నెలల కాలంలో భూములు అమ్మి రూ.6500 కోట్లు ఎలా సవిూకరిస్తారని, రూ.లక్ష 600 కోట్ల బ్జడెట్ ఎలా ఆచరణ సాధ్యమవుతుందని ప్రశ్నించారు. తమ అంచాన ప్రకారం ప్రభుత్వానికి రూ.70 నుంచి 75 వేల కోట్లు మాత్రమే వచ్చే అవకాశముందన్నారు. ఏపీలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 54 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీది కీలకపాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రావడంలో సకల జనుల పాత్ర ఉందన్నారు. 2004 నుంచి 2014 వరకు ఇండస్టియ్రల్ గ్రోత్ రేట్ 9.4 గా ఉందని చెప్పారు. విద్యుత్ విషయంలో ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోళ్ల పరిశ్రమకు వ్యవసాయ ¬దా ఇవ్వడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం కరువు మండలాలను త్వరగా ప్రకటించాలని ఆయన కోరారు. పాలపై వ్యాట్‌ను తగ్గించి, అదేవిధంగా ఉద్యోగాల భర్తీ పక్రియను వెంటనే చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.ఎన్నికల హావిూలను విస్మరిస్తే సహించబోమని తెలంగాణ తెదేపా శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ… ఉద్యోగులు, విద్యార్థులు, సహా అన్ని వర్గాల వారు ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. రాష్ట్ర సాధనలో అందరి పాత్ర ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ తప్పుల వల్లే ప్రజలు తెరాసకు అధికారం కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంతో ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, పంటలు ఎండిపోయి అప్పులపాలై రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వాటిని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. విద్యుత్ విషయంలో కేంద్రంతో మాట్లాడేందుకు తాము ప్రభుత్వానికి సహకరిస్తామని ఎర్రబెల్లి తెలిపారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మజ్లిస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ… ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం సభ ఎదుట శ్వేతపత్రం ఉంచాలన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం 11శాతం నిధులను మాత్రమే కేటాయించారన్నారు. బంజారాహిల్స్‌లో బంజారాభవన్‌లు నిర్మిస్తామనడం స్వాగతిస్తున్నామన్నారు. బంజారాల కోసం నగర వ్యాప్తంగా బంజారాభవన్‌లు నిర్మించాలన్నారు. దళితులు, బంజారాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు. యువత ఆత్మత్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై ఆయన శాసనసభలో మాట్లాడుతూ… ఉద్యమంలో ఉద్యోగులు, విద్యార్థులు సహా సకల జనులు పాల్గొన్నారని, అయితే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కనీసం భాజపాను ఆహ్వానించలేదని అన్నారు. పాలకులు తెలిసి కొన్ని.. తెలియక కొన్ని తప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు. బోధన రుసుములు వస్తాయో రావోనని విద్యార్థులు ఆందోళనతో ఉన్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దీనికి తోడు ప్రతి అంశంలో ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోందన్నారు. రాజ్యాంగ బద్ధంగా సభ్యులకు దక్కాల్సిన గౌరవం సభాపతి కల్పించాలని సభలో ఓ సభ్యుడిని కొంతమంది మాట్లాడనీయకుండా చేయడం సరికాదని హితవు పలికారు. రాష్ట్ర సాధనలో తెలంగాణ రాజకీయ ఐకాస కీలక పాత్ర పోషించిదని, ఉద్యమంలో కీలకమైన ఓయూ విద్యార్థులపై ఇప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని మండిపడ్డారు. సమగ్ర సర్వే వల్ల వచ్చిన ఫలితం ఎవరికీ తెలియటం లేదని, పింఛను, రేషన్ కోసం మళ్లీ దరఖాస్తులు కోరడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యుత్ కోసం మెదక్ జిల్లాలో రైతులు ఆందోళన చేస్తే వారిని కొట్టించాల్సిన అవసరం ఏం వచ్చింది అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తెరాస సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, సిపిఎం ఫ్లోర్ లీడర్ సున్నం రాజయ్య, వైకాపా ఫ్లోర్ లీడర్ పాయం వెంకటేశ్వర్లు ద్రవ్య వినిమయ బిల్లుపై పలు సూచనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, సభ్యులు లేవనెత్తిన అనుమానాలపై వివరణ ఇచ్చారు.





