Monday, 2 November 2026

మీ కల మేము సాకారం చేస్తాం

2

కాశ్మీర్‌ ఎన్నికల సభలో మోదీ

శ్రీనగర్‌, నవంబర్‌ 28 (జనంసాక్షి) : ‘విూ కలలను మేము సాకారం చేస్తాం.. మమ్మల్ని ఆశీర్వదించండి’.. అని ప్రధాని నరేంద్రమోదీ కాశ్మీరు ఓటర్లను కోరారు. జమ్మూకశ్మీర్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదంపూర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి మోదీ పాల్గొని ప్రసంగించారు.జమ్మూకశ్మీర్‌ ప్రజలు బుల్లెట్‌ నుంచి బ్యాలెట్‌ బాట పట్టారని అభినందించారు.  గత నెల దివాళి సందర్భంగా ఇక్కడికి వచ్చా… మళ్లి డిసెంబరులోనూ వస్తానని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతల్ని కాపాడటంతో పాటు, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఉపాధి కావాలని యువత కోరుకుంటోందని, పర్యాటక రంగం వల్ల చాలామందికి ఉపాధి లభిస్తుందన్నారు. బ్యాంకుల వద్దకు వెళ్తామని పేదలు ఏనాడైనా అనుకున్నారా? జన్‌ధన్‌ యోజన పథకం కింద పేదలకు బ్యాంకు ఖాతా సదుపాయం కల్పించినట్లు చెప్పారు. గత 30 ఏళ్లలో లేని అభివృద్ధిని ఐదేళ్లలో సాధించి పెడతామన్నారు. జమ్మూకశ్మీర్‌ ప్రజల మనసుల్లో ఏముందో ప్రపంచానికి తెలిసిందని మోదీ వాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *