ధరణ రద్దు..
` భూభారతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి
` ప్రజలకు భరోసానిచ్చేలా కొత్త చట్టం
` ఇక పక్కాగా రెవెన్యూ రికార్డులు
` పోర్టల్ సమస్యలకు చెక్ పెట్టే విధంగా మార్పులు
` అన్ని వర్గాలతో చర్చలు..సలహాలతో కొత్త చట్టం
` వివాదాల పరిశీలనకు కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు
` గ్రామానికో రెవెన్యూ అధికారి నియామకం
` అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం తెచ్చిన ప్రభుత్వం
` గత పాలకుల ధరణి మోసాలను ఎండగట్టిన పొంగులేటి
హైదరాబాద్(జనంసాక్షి):ధరణిలో జరిగిన అవతవకలను అరికట్టి, రైతులకు న్యాయం చేయాలన్న సంకల్పంతోనే భూభారతిని తీసుకుని వస్తున్నామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి తెలిపారు. భేషజాలకు పోయి ’ధరణి’ని మార్చడం లేదని.. ప్రజాసమస్యల పరిష్కారానికే ఆ పోర్టల్‌ను రద్దు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన పోర్టల్ వల్ల 4 నెలలు రిజిస్టేన్ల్రు జరగలేదన్నారు. శాసనసభలో ’భూభారతి’ బిల్లును పొంగులేటి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ధరణితో అనేక మంది ఇబ్బందులు పడిన మాట వాస్తవం. ఆ పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామని హావిూ ఇచ్చాం.. ఇప్పుడు వేస్తున్నాం. ధరణి స్థానంలో భూభారతిని తీసుకొస్తున్నాం. భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు లిఖితపూర్వకంగా సూచించిన అంశాలను పొందుపరిచాం. ముసాయిదా బిల్లును 40 రోజులు వెబ్సైట్లో ఉంచాం. ఎమ్మెల్యేలు, మేధావులు ఇచ్చిన అంశాలను డ్రాప్ట్‌లో పెట్టాం. రాష్ట్రంలోని 33 కలెక్టరేట్లలో ఒకరోజు చర్చ కూడా నిర్వహించాం. 18 రాష్టాల్ల్రో ఆర్ఓఆర్ చట్టాలను పరిశీలించి భూభారతి తీసుకొచ్చాం. ప్రతి గ్రామానికి ఓ రెవెన్యూ అధికారిని నియమిస్తాం. భూ వివాదాలపై అప్పీలుకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తాం. అనుభవదారుల కాలాన్ని కూడా ఈ కొత్త బిల్లులో పొందుపరిచాం. 33 మాడ్యూల్స్‌తో ఉన్న దాన్ని 6 మాడ్యూల్స్‌తో పునఃప్రక్షాళన చేస్తున్నాం‘అని పొంగులేటి సభలో వివరించారు. తెలంగాణలో సామాన్యుల భూహక్కుల పరిరక్షణే ధ్యేయంగా 2024 ఆర్వోఆర్ -భూభారతి చట్టాన్ని రూపొందించామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇటువంటి అద్భుతచట్టాన్ని ప్రవేశపెట్టే అవకాశం తనకు లభించడం మరచిపోలేని విషయమని అన్నారు. 1971లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్వోఆర్ చట్టం 49 ఏళ్లపాటు ఉపయోగపడిరదని, ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏడేళ్ల పాటు కూడా ప్రజోపయోగంగా ఉపయుక్తమయ్యిందని తెలిపారు. తర్వాత అర్ధరాత్రి నాలుగు గోడల నడుమ రూపొందిన ధరణి చట్టం వలన సమస్యలు పరిష్కారం కాకపోగా లక్షలాది సమస్యలను తెచ్చిపెట్టిందని చెప్పారు. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిరదన్నట్లు ధరణి పోర్టల్‌తో లెక్కలేనన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, నాటి ప్రతిపక్షనేత , నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి , నేటి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమ పాదయాత్రల సందర్బంగా ధరణిని సముద్రంలో కలుపుతామని ఇచ్చిన హావిూని ప్రజలు విశ్వసించారని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆమేరకు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని, ఒక్క గుంట భూమి ఉన్న వారు కూడా తమను నమ్మారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకుగాను ఆర్వోఆర్ 2020ను పూర్తిగా ప్రక్షాళన చేసి భూభారతిని రూపొందించామని చెప్పారు. తాము ఆగస్టు 2న ముసాయిదాను ప్రవేశపెట్టడమేగాక ప్రత్యేకంగా 40 రోజుల పాటు వెబ్ సైట్లో పెట్టి ప్రజాప్రతినిధులు,కవులు , మేధావులు, విశ్రాంత అధికారుల సలహాలు సూచనలు స్వీకరించి కొత్త చట్టానికి రూపకల్పన చేశామని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు 7 పేజీలు, వినోద్‌రావు 5 పేజీల సలహాలు . సూచనలు చేశారని వాటిని కూడా పరిగణనలోకి తీసుకున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. 33 జిల్లాలలో ఒక్కోరోజు ప్రత్యేక చర్చావేదికలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. ధరణ కారణంగా ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కేసముద్రం మండలం నారాయణపురంలో కె. రవి అనే ఎంపీటీసీ సభ్యులు భూ సమస్లలను బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలందరి దృష్టికి తీసుకువెళ్లారని , ఏళ్ల తరబడి పరిష్కారం కాలేదని చెప్పారు. అంతేగాక సర్వేనెంబర్లు 149,150, 154,156, 168 తదతరాల్లోని 1398 ఎకరాల భూమి తరతరాలుగా అక్కడి గిరిజనుల సాగుబడిలో ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ధరణి -2020 ఆర్వోఆర్ చట్టం వచ్చాక వారి హక్కులకు భంగం వాటిల్లేలా సదరు భూములు అటవీ భూములని తేల్చిచెప్పారని దీంతో గిరిజనులు తీవ్ర మనోవేదననకు గురయ్యారని మంత్రి వివరించారు. భూభారతి బిల్లుకు సంబంధించి 22-23 సార్లు అభిప్రాయాలు తీసుకున్నామని, అందువల్లే బిల్లు ప్రవేశపెట్టడంలో .జాప్యం జరిగిందని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రజలకు పూర్తిస్ధాయిలో ఉపయోగ పడేలా బిల్లు తయారుచేసేందుకు కృషి చేశామని, సాదాసీదా బిల్లును ప్రజలపై రుద్దే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. భూమి చుట్టూ మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. తరతరాలుగా మనిషి జీవితానికి, భూమికి విడదీయరాని అనుబంధం ఉంది. భూమి పేదరికాన్ని దూరం చేస్తుంది. ఆత్మగౌరవంతో బతికే అవకాశాన్ని ఇస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తుంది. గ్రామాల్లో భూమే ప్రధాన జీవనాధారం. భూమిని నమ్ముకుని బతికే కష్టజీవులను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలది. కానీ గత ప్రభుత్వం దీన్ని విస్మరించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1971లో తీసుకొచ్చిన ఆర్వోఆర్ చట్టం 49 ఏండ్లు విజయవంతంగా అమలైంది. ప్రజల అవసరాలే లక్ష్యంగా అసైన్డ్ లాండ్స్ మొదలు అనేక విధాన నిర్ణయాలను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని వివరించారు. కాంగ్రెస్ అంటేనే ప్రజలకు ఒక భద్రత, భరోసా. అందుకే ఇప్పటికీ ఇందిరమ్మను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారు. ధరణి కారణంగా భూ యజమానికి తెలియకుండానే చేతులు దాటిపోయేలా చేసింది. కాళ్ళకింద నేల కదిలిపోయినా పేదలు వారి ఆవేదనను చెప్పుకోడానికీ మార్గం లేకుండా చేసింది.ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా సీఎం రేవంత్‌రెడ్డి గారి సూచన మేరకు ధరణి కష్టాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి భూ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. రెవెన్యూ చట్టాలను ఈ కమిటీ అధ్యయనం చేసింది. ప్రజల నుంచి చట్టం రావాలనే ఉద్దేశంతో అదే రోజున సీసీఎల్ఏ వెబ్సైట్లో కూడా ముసాయిదా బిల్లును అందుబాటులో ఉంచాం. దాదాపు పాతిక రోజుల పాటు ప్రజా ప్రతినిధులు, రైతుసంఘాల ప్రతినిధులు, మేధావులు, సామాన్య ప్రజానీకం, రిటైర్డ్ అధికారుల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించాం. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు సదస్సులు నిర్వహించి అభిప్రాయాలను స్వీకరించారు. చివరకు 2020 చట్టంలో ప్రధాన పాత్ర పోషించిన తన్నీరు హరీశ్‌రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ సూచనలు కూడా స్వీకరించాం. ఒక చట్టం విూద ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం చేస్తామని అన్నారు. రిజిస్టేష్రన్ దస్తావేజుల ద్వారా వచ్చే మ్యుటేషన్ జరిగేటప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ (అథారిటీ)ని ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా పనికొచ్చేదున్నదంటే… రిజిస్టేష్రన్, ఆ వెంటనే మ్యుటేషన్ జరిగే వెసులుబాటే. కానీ దురదృష్టవశాత్తూ తప్పులకు పరిష్కారం చూపే వ్యవస్థే లేదు. సేల్ డీడ్, వారసత్వం … కాక కోర్టు ద్వారా వచ్చే, ఓఆర్సీ, 38-ఈ తదితర మొత్తం 14 రకాల భూమి హక్కులపై మ్యుటేషన్ పవర్స్ ను ఆర్డీవో ….సాదా బైనామా … : 2020 నవంబరు 10 వరకు ఆన్లైన్లో వచ్చిన సుమారు 9.24 లక్షల దరఖాస్తులకు పరిష్కారం…చూపుతామని అన్నారు. దేశంలో ప్రతీ పౌరుడికి ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో మన రాష్ట్రంలో భూములకూ భూధార్ నంబర్…తెస్తామని అన్నారు. 2014కు ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ, జమాబందీ ఎలా ఉండేదో ఇకపైనా అదే విధంగా కొనసాగిస్తాం. త్వరలోనే ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమిస్తాం. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించింది. భూ వివాదాల గ్రీవెన్స్, అప్పీళ్ళ కోసం లాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు… అవసరాన్ని, ప్రాంతాన్ని బట్టి సంఖ్యపై ప్రభుత్వ నిర్ణయం…ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని, రికార్డుల్ని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తారుమారు చేస్తే సీసీఎల్ఏ ద్వారా రివిజన్ చేసుకునే ఆప్షన్ ను ఈ చట్టంలో పొందుపరుస్తున్నాం. ప్రభుత్వ అధికారులపై చర్యలు: ప్రభుత్వ ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులపై చర్యలు తీసుకుని శిక్షించే అధికారాన్ని ఈ చట్టం ద్వారా తీసుకొస్తున్నాం అన్నారు. 2014 కి ముందు పాస్ బుక్కులు కలిగి ఉంది అనుభవదారుడిగా పొసిషన్ లో ఉన్న వారు ధరణి తరువాత రోడ్డున పడ్డారు. గత ప్రభుత్వం ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించింది. భూ భారతిలో పట్టాదారులు, అనుభవదారులు అభద్రతాభావానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఈ చట్టం వీరికి సముచిత స్థానం కల్పిస్తాం.రెవెన్యూ రికార్డులు టాంపరింగ్ జరగకుండా కంప్యూటర్ రికార్డులతో పాటు నిర్ణీత కాల వ్యవధిలో మాన్యువల్ కాపీని కూడా రెవెన్యూ కార్యాలయాలలో భద్రపరుస్తాం అన్నారు. గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా లాకర్లలో బంధించింది. ఇప్పుడు భూ-భారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకునేలా డిస్ప్లే చేస్తున్నాం. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి గురికాకుండా ఎవరైనా భూ భారతి ద్వారా ప్రభుత్వానికి తెలియ చేయవచ్చు. ఆ భూముల్ని పరిరక్షించేలా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నాం. భూ-భారతిలో దరఖాస్తు చేసుకున్న భూములున్న ఆసాములకు వారి మొబైల్ నెంబర్లకే అప్డేట్స్ వెళ్ళే సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. గతంలో ధరణి కారణంగా అన్యాక్రాంతమైన భూముల వివరాలను భూ భారతి ద్వారా బట్టబయలు చేస్తాం. 2014కు ముందు సబ్ రిజిస్టార్ర్ ఆఫీసుల దగ్గర ఉన్న ప్రభుత్వ భూముల జాబితాలోని రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్, ఫారెస్ట్ తదితర భూముల వివరాలను ధరణిలోని డేటాతో పోల్చి చూసి అన్యాక్రాంతమైన భూముల వివరాలను బహిర్గతం చేస్తాం. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించినవారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు. ఆ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతాం. రూల్స్ ఫ్రేమ్ అయిన తర్వాత గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు పెట్టి అధికారులతో పాటు నేను, సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి పరిష్కారాన్ని యుద్ధ ప్రాతిపదికన కనుగొంటాం.అందరికీ ఆమోదయోగ్యంగా తీసుకొస్తున్న భూ-భారతి చట్టం కనీసం వందేళ్ళు వర్ధిల్లుతుందని ఈ ప్రభుత్వం బలంగా నమ్ముతున్నదని మంత్రి వివరించారు.