Tuesday, 3 November 2026

ధర్డ్‌ పార్టీతో జగన్‌పై దాడి కేసు విచారణ

 

ప్రస్తుత విచారణపై నమ్మకం లేదని వెల్లడి

కుట్ర కోణంలో దర్యాప్తు సాగడం లేదని ఆరోపణ

గవర్నర్‌కు వైకాపా నేతల వినతిపత్రం

హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్న ఘటనపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన విచారణ కుట్రకోణ దిశగా జరగడం లేదని వైఎస్సార్‌పీపీ నేత ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. దాడి ఘటన పై ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వివరించేందుకు గురువారం వైస్సార్‌సీపీ నేతలు గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. ఈ మేరకు వినతి

పత్రం సమర్పించారు. అనంతరం ధర్మాన విూడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై దాడి ఘటన అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను గవర్నర్‌కు వివరించామన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గవర్నర్‌ డీపీపీతో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. హత్యాయత్నం జరిగిన అరగంటలోపే డీజీపీ తన అభిప్రాయాన్ని చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. సీఎం, డీజీపీల తీరును గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. హత్యాయత్నం వెనుక కుట్రదారులు బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. హత్యాయత్న ఘటనపై థర్డ్‌ పార్టీతో విచారణ చేయాలని గవర్నర్‌ను కోరామని ధర్మాన తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ నేతలు ధర్మాన ప్రసాద రావు, ఆర్కే రోజా, మోపిదేవి వెంకటరమణ, కోన రఘుపతి, తదితరులు ఉన్నారు.

జగన్‌ను రాజకీయంగా తొక్కేయడానికే

అనంతరం రోజా విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ను రాజకీయంగా తొక్కేయడానికి వైఎస్సార్‌సీపీ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొన్నా మొక్కవోని దీక్షతో ప్రజల్నే నమ్ముకుని నిలదొక్కుకున్నారని వ్యాఖ్యానించారు. గతంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అవసరమైన మెజార్టీ లేకపోయినా చంద్రబాబు నాయుడు తన మద్ధతు ఇచ్చి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఇబ్బంది పెట్టారని రోజా ఆరోపించారు. ప్రజల్లో వైఎస్‌ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అంతమొందించాలని పక్కా ప్లాన్‌ చేసి హత్యాయత్నం చేశారని విమర్శించారు. టీడీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడి కేసు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చిన్న గాయమంటూ కేసును తేలికగా కొట్టిపారేస్తున్నారని, కుట్ర కోణంలో విచారణ సాగకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కేసులో కీలక నిందితుడు హర్షవర్దన్‌ చౌదరీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, గంటా శ్రీనివాసరావులకు ఎంత సన్నిహితుడో అందరికీ అర్దమవుతోందన్నారు. ఆపరేషన్‌ గరుడ పేరుతో నాటకం ఆడుతున్న శివాజీని అరెస్ట్‌ చేసి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. పథకంలో భాగంగానే ముందే శివాజీ అమెరికా పారిపోయాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చరిత్ర అంతా హత్యా రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లేనని, తనకు అడ్డుగా వస్తే పిల్లనిచ్చిన మామను కూడా అడ్డుతొలగించిన చరిత్ర బాబుదన్నారు. తనపై ఆరోపణలు వచ్చిన వెంటనే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన పెద్ద నాయకుల కాళ్లు పట్టుకుంటారని చంద్రబాబునుద్దేశించి ఎద్దేవా చేశారు. దేశం, రాష్ట్రం నుంచి చంద్రబాబును తరిమికొట్టినప్పుడే తెలంగాణా, ఏపీ బాగుపడతాయని వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌ను చంపి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి తనపై వస్తున్న వ్యతిరేకతను పక్కదోవ పట్టిద్దామని అనుకున్నారని చెప్పారు. వైఎస్‌ జగన్‌కు ప్రజలు, దేవుడిపై అపార నమ్మకం ఉందని, జగన్‌ను పార్టీ కార్యకర్తలే కాపాడుకుంటారని అన్నారు. ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగింది కాబట్టి తమకు సంబంధం లేదని చెబుతున్న టీడీపీ నేతలు.. గతంలో ప్రత్యేక ¬దా ఉద్యమంలో పాల్గొనడానికి విశాఖ వచ్చినపుడు ఎయిర్‌పోర్టు రన్‌వే విూద ఎలా పోలీసులు అడ్డుకున్నారని సూటిగా ప్రశ్నించారు.

బాబు ఎంతకైనా దిగజారుతాడు: భూమన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం ఎంతటికైనా దిగజారుతాడని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు స్వార్థం కోసమే కాంగ్రెస్‌తో చేతులు కలిపారని ఆరోపించారు. స్వర్గీయ

నందమూరి తారక రామారావు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీని స్టాపించాడని, ఎన్‌టీఆర్‌కు చంద్రబాబు వెన్ను పోటు పొడిచి టీడీపీని లాక్కున్నాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు! రాహుల్‌ గాంధీని కలవటం దుర్మార్గమని అన్నారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్‌ సీపీ అవిశ్వాసం పెడితే చంద్రబాబు కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన సంగతిని గుర్తు చేశారు. కాంగ్రెస్‌తో చంద్రబాబుకు చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయన్నారు. సోనియా గాంధీతో కుమ్మక్కై వైస్‌ జగన్‌ విూద అక్రమ కేసులు పెట్టించాడని ఆరోపించారు. ఈ రోజు చంద్రబాబు రాహుల్‌ గాంధీని కలవటంలో ఆశ్చర్యం ఎవిూ లేదని అన్నారు. జగన్‌కు లభిస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు వెన్నులొ చలి పుడుతోందని, అందుకే ఏ పార్టితో నైనా చంద్రబాబు కలవడానికి సిద్దంగా ఉన్నాడని అన్నారు.