ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి – సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్

చేర్యాల (జనంసాక్షి) జూన్ 08 : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం వారు మాట్లాడుతూ.. పీఏసీఎస్,ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం వంద శాతం కొనుగోలు చేసి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు సక్రమంగా జరగడం లేదని, వర్షాకాలం కావడంతో ఎప్పుడు వర్షం పడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. నిర్లక్ష్యం చేస్తే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.