నంబరు ప్లేట్లు లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు

మాగనూర్ మండలంలో సాయంత్రం నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, ఆర్సీ, లైసెన్స్, పెండింగ్ చలాన్స్, డ్రంక్ అండ్ డ్రై వాటిపై యస్ ఐ నరేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 15 బైకులు 4 కార్లు  పట్టుకుని జరిమానా విధించారు. వాహనదారులకు పోలీసు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. నంబర్ ప్లేట్లు లేకుండా మరోసారి పట్టుబడితే వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉమేష్ గౌడ్, సాయికుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.