నకిరేకల్ కు చేరుకున్న నర్రా రాఘవరెడ్డి భౌతికకాయం

నల్గొండ: సీపీఎం సీనియర్ నేత నర్రారాఘవరెడ్డి భౌతికకాయం నకిరేకల్ కు చేరుకుంది. ఆయన అభిమానుల సందర్శనార్థం గంటల పాటు నకిరేకల్ సీపీఎం పార్టీ ఆఫీసులో రాఘవరెడ్డి భౌతికాయాన్ని ఉంచనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పట్టిమర్తిలో రాఘవరెడ్డి అంత్యక్రియలు జరగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.