Tuesday, 3 November 2026

18న అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

విజయవాడ,నవంబర్‌13(జ‌నంసాక్షి): పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండల కేంద్రంలో ఈ నెల 18 న డాక్టర్‌ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం విడుదల చేశారు. విజయవాడలోని సచివాలయంలో ఈ కరపత్రాలను పరిశ్రమల శాఖ మంత్రి ఎన్‌.అమరనాథ్‌ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెద్ద పంజాణి ఎస్సీసెల్‌ అధ్యక్షుడు కెళవాతి సుబ్రమణ్యం, టిఎం మంజునాథ, కె తిప్పయ్య, గుండా మనోహర్‌, తదితరులు పాల్గొన్నారు.