నగరంలో వ్యక్తి దారుణహత్య


హైదరాబాద్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ కాలాపత్థర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు సిద్దిక్‌ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. సిద్దిక్‌ తలపై గుర్తు తెలియని వ్యక్తులు బండ రాళ్లతో మోది హత్య చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.