Friday, 6 November 2026

నగరంలో 150 చేపల ఔట్‌ లెట్లు ఏర్పాటు చేస్తాం

సనత్‌నగర్‌లో మనకూరగాయల విక్రయ కేంద్రం ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్‌,మే22(జ‌నం సాక్షి): నగర పరిధిలో ఉన్న కోటి జనాభాకు సరిపడా ఆరోగ్యకర కూరగాయలు అందిచుటకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌ విభాగం సహకారంతో 300 మన కూరగాయల విక్ర కేంద్రాలను నెలకొల్పుతున్నట్లు  రాష్ట్ర పశు సంవర్థక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మంగళవారం సనత్‌ నగర్‌లో నెలకొల్పి మన కూరగాయలు విక్రయ  కేంద్రాన్ని పార్లమెంట్‌ సభ్యులు బండారు దత్తాత్రేయతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి విడతలో అనుకున్న వంద కేంద్రాలలో ఇది 56వదని తెలిపారు. తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు, పండ్లు వినియోగదారులకు అందిచడమే ఈ కేంద్రాల లక్ష్యమని తెలిపారు. నేరుగా కొనుగొలు చేసి విక్రయించడం వలన నియె/ఔగదారుల తోపాటు రైతులకు కూడా లబ్దిచేకూరుతుందన్నారు. ప్రజలకు చేరువగా ఉండెందుకు 150 చేపల విక్రయ ఔట్‌ లెట్లు  కూడా నగరంలో ఏర్పాటు చేయనున్నట్లుప్రకటించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సత్‌గర్‌ నియెజకవర్గం ముందున్నదని చెప్పారు.సనత్‌ గర్‌ ప్రాంత ప్రజలకు త్రాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించేందుఏకు చేపట్టిన రిజర్వాయర్‌పనులు జూన్‌ లోపు పూర్తి కానున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రత్యేక శ్రద్దతీసుకుంటున్నారని, అందులో భాగంగా ప్రతి మండల కేంద్రంలో ఒక మార్కెటింగ్‌ గోడౌన్‌నిర్మించిట్లు తెలిపారు.  ఎం.పి. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరల పై నియంత్రణ చేసి సామాన్యులకు అందుబాటులో ఉంచాలని కోరారు. కూరగాయలు, పండ్లు నాణ్యతను  కాపాడేందుకు శీతల గోడౌన్ల నిర్మాణానికై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిదులు  ఉపయెగించుకోవాలని సూచించారు. దుకాణాల ద్వారా మహిళలు కూరగాయలు అమ్ముకునేందు ముద్రా రుణాలను పొందాలనిచెప్పారు. రూ. 5 లక్షల వరకు ఎటువంటి పూచికత్తు లేకుండా సులభంగా ముద్రా రుణాలు ఇస్తున్నట్లుతెలిపారు. మన కూరగాయల కార్యక్రమం చాలా మంచిదని ప్రభుత్వ చర్యను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్‌ జోన్‌ కమిషనర్‌  భారతి ¬ళికేరి, స్థానిక కార్పొరేటర్‌లక్ష్మి బాల్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.