తోపుడు బండ్లపై టూ విలర్లు పెట్టి ఆందోళన
హైదరాబాద్,మే22(జనం సాక్షి): పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం గాంధీభవన్ నుండి నాంపల్లి చౌరస్తా వరకు తోపుడు బండ్ల పై మోటార్ సైకిళ్లు పెట్టి నెట్టుకుంటూ నిరసన తెలిపారు. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలంటూ చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మోదీ వచ్చాక అచ్చేదిన్ కాదు బురె దిన్ వచ్చాయని యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
పెట్రో ధరలపై కాంగ్రెస్ నిరసనలు




