Tuesday, 3 November 2026

నగరానికి వన్నె తెచ్చే జగదాంబ షాపింగ్‌మాల్‌

కరీంనగర్‌ టౌన్‌ : నగరంలో అతి పెద్ద పురుషుల షూటింగ్స్‌, షర్టింగ్స్‌, మెన్స్‌వేర్‌, షాపింగ్‌మాల్‌ జగదాంబ నేడు ప్రారంభం కానుంది. నగర ప్రజలు షాపింగ్‌ కొరకు హైద్రాబాద్‌, వరంగల్‌ నగరాలకు వెళ్లకుండా ఇక్కడే అన్ని రకాల పురుషుల దుస్తులు, వస్త్ర సంబంధిత వస్తువులు ఒకే దగ్గర లభ్యమవడంతో ప్రజలు సంతోషం వెలిబుచ్చుతున్నారు. పురుషుల షాపింగ్‌ కొరకు కావాల్సిన అన్ని రకాల మెన్స్‌ వేర్‌, ఎథ్నిక్‌ వేర్‌లు లభిస్తాయి. ఈ షాపింగ్‌మాల్‌ ఓపెనింగ్‌కు జిల్లా మంత్రి శ్రీధర్‌ బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, విప్‌ ఆరెపల్లి మోహన్‌లు ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. సినీ హీరో  సిద్ధార్థ్‌ షాపింగ్‌మాల్‌ను ప్రారంభించడం ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. దీంతో అభిమానులు సిద్దార్థ్‌ రాక కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. షాపింగ్‌మాల్‌ను ఉదయం 11.30 గంటలకు సిద్ధార్థ్‌ ప్రారంభించనున్నారు. వివాహ, శుభకార్యలకు షాపింగ్‌ కొరకు పెద్ద నగరాలకు వెళ్లకుండా అన్ని రకాల దుస్తులు ఇక్కడ లభ్యమవుతుందని షాపింగ్‌ మాల్‌ యాజమాన్యం తెలిపింది. పెళ్లిళ్ల్ల కొరకు పురుషులకు సంబంధించిన  అలంకరణ వస్తువులు కూడా లభ్యమయ్యే విధంగా షాపింగ్‌మాల్‌ను తీర్చిదిద్దినట్లు వారు తెలిపారు. నగరం మొత్తం జగదాంబ షాపింగ్‌ మాల్‌ పోస్టర్‌లతో నిండిపోయింది. సిద్దార్థ్‌ వస్తుండడం, పురుసుల కోసమే ప్రత్యేకంగా ఓషాపింగ్‌మాల్‌ ఓపెనింగ్‌ అవుతుండడంతో నగరంలో కోలాహలం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *