Monday, 2 November 2026

నటుడు నాగయ్య కష్టాలపై చలించిన కేటీఆర్‌

3

– లక్ష రూపాయల ఆర్థిక సాయం

హైదరాబాద్‌,జూన్‌29(జనంసాక్షి):

ప్రముఖ కళాకారుడు మాదాసు నాగయ్య దీన్థసితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చెలించారు. ఆయన తక్షణ సహాయంగా రూ.లక్ష నగదును అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వృద్ధ కళాకారుల పింఛను కింద నాగయ్యకు ప్రతినెలా రూ.1500 అందిస్తామన్నారు. కళాకారులకు ఆర్థికసాయం విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు.వేదం సినిమాలో నటించి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వృద్ధ కళాకారుడు నాగయ్య గురించి తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ రూ. లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం అన్ని విధాలా నాగయ్యను ఆదుకుంటుందని కేటీఆర్‌ హామి ఇచ్చారు. మిగితా పేద కళాకారులకు ఆర్థిక సహాయం అందించే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. నాగయ్య కుమారుడికి ఇళ్లు మంజూరు

చేస్తామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *