నత్తనడకన కనకదుర్గమ్మ వారధి పనులు
విజయవాడ,నవంబర్13(జనంసాక్షి): విజయవాడ నగరంలో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై కనకదుర్గ దేవాలయం విూదుగా ఆరు వరుసల పైవంతెన నిర్మాణం నత్తనడక తలపిస్తోంది. ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా మార్చి వరకు నిర్మిస్తామని హావిూతీసుకున్నారు. కనకదుర్గ గుడి వద్ద రహదారి నాలుగు వరసలుగా విస్తరించడం సాధ్యం కాకపోవడంతో అనుబంధంగా కృష్ణానదిలో పారా వంతెన నిర్మాణం చేశారు. రెండు వరసలు నిర్మాణం చేశారు. ఇది దాదాపు పూర్తయింది. ఇంకా నాలుగు గర్డర్లు ఏర్పాటు
చేయాల్సి ఉంది. రెండు పోర్షన్ల స్లాబ్ వేయాల్సి ఉంది. అయితే పైవంతెన పూర్తయిన తర్వాత తిరిగి తారు వేయాల్సి ఉంది. 2,502 విూటర్లు డీబీఎం2 పొర వేయాల్సి ఉంది. వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి వాహనాలను ఈరహదారిపై వదలాలని నిర్ణయించారు. అప్పటికి కనకదుర్గ దేవాలయం వరకు ఉన్న 23 పిల్లర్ల వరకు స్లాబ్ పూర్తి చేయాల్సి ఉంది. దీనికి కసరత్తు జరుగుతోంది. నిర్మాణం కారణంగా పైవంతెన మార్గంలో ఇరువైపులా పూర్తిగా వాహనాల రాకపోకలను అనుమతించడంలేదు. ప్రకాశం బ్యారేజీ నుంచి కుమ్మరిపాలెం వరకు పూర్తిగా నిషేధం అమలు లో ఉంటుంది. వాహనాలు వెళ్లకుండా శాశ్వత బారికేడ్లు నిర్మాణం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఇక్కడ అండర్‌పాస్ నిర్మాణం చేయాల్సి ఉంది. మరో అండర్‌పాస్ రాజీవ్ పార్కు సవిూపంలో నిర్మాణం చేయాల్సి ఉంది. ఇక్కడ విద్యుత్తు లైనుకు సంబంధించిన హెచ్‌టీ టవర్ అడ్డుగా ఉంది. దీన్ని తొలగించి నిర్మాణం చేయాల్సి ఉంది. కాలువలో నిర్మించాల్సిన పిల్లర్లకు నీటి ప్రవాహం అడ్డంకిగా ఉంది.




