Thursday, 5 November 2026

వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యం చేరుకోవాలి

అనంతపురం,నవంబర్‌13(జ‌నంసాక్షి): వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం శరవేగంగా సాగాలని అనంత జడ్పీ ఛైర్మన్‌ పూల నాగరాజు అన్నారు. స్వచ్చ భారత్‌లో బాగంగా ఈ కర్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ప్రజలు తమవంతుగా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలని అన్నారు. ప్రధనాంగా గ్రామ ప్రజలు దోహదపడాలని అన్నారు. గతంలో పూర్తి చేసిన మరుగుదొడ్ల వివరాలను నమోదు చేయాలన్నారు. గతంలో డ్వామా, డీఆర్‌డీఏ, ఆర్‌డబ్టూఎఎస్‌ శాఖల పర్యవేక్షణలో చేపట్టిన మరుగుదొడ్ల వివరాలను తెలుసుకున్నారు. వాటి గణాంకాలకు క్షేత్ర స్థాయిలో సేకరించి నమోదు చేయాలన్నారు. దీంతో మరుగుదొడ్ల నిర్మాణంలో ఎక్కడ అలసత్వం జరుగుతుందో స్పష్టంగా బహిర్గతం అవుతుందన్నారు. లోపాలు స్పష్టంగా బయటికి వస్తాయన్నారు. ఆయా గ్రామాలు ముందుంటే ప్రోత్సాహకాలు ఇస్తామని అన్నారు.