హైదరాబాద్: మెక్సికోలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది.ఈ దుర్ఘటనలో 20 మంది మృతిచెందగా, మరో 25 మంది గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెరాక్రూస్ ప్రాంతంలో 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వంతెన రెయిలింగ్‌ను ఢీకొని అటోయక్ నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న సహాయ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులంతా కమరోన్, కోర్డోబా ప్రాంతాలను చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారులేనని అధికారులు తెలిపారు
నదిలో పడిన బస్సు… 20 మంది మృతి





