హైదరాబాద్: నయీం గ్యాంగ్‌స్టర్‌గా ఎదగడానికి ప్రభుత్వం, పోలీసు అధికారులే కారణమని.. అతడి ఆగడాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. నయీంను ప్రోత్సహించిన మంత్రులు, డీఐజీ స్థాయి అధికారులపై సమగ్ర విచారణ జరిపించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో మరో కొత్త నయీంలు పుట్టుకురాకుండా ఉండాలంటే కఠినచర్యలు తీసుకోవాలన్నారు. నయీం దౌర్జన్యంగా సంపాదించిన ఆస్తులు, భూములను పేదలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు.
నీటి ప్రాజెక్టులకు గతంలో తెరాస, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రజెంటేషన్లు తప్పుల తడకలుగా ఉన్నాయని వెంకటరెడ్డి విమర్శించారు. రెండు పార్టీలు చెప్పిన లెక్కలు తేలాలంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. కరవు నష్టపరిహారాన్ని కేంద్రం నుంచి తీసుకురావడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీ నిధులు పూర్తిస్థాయిలో విడుదల చేసి.. రైతులకు కరవు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.




