Tuesday, 3 November 2026

ప్రత్యేక జిల్లా కోసం రాస్తారోకో

ములుగు: వరంగల్‌ జిల్లా ములుగును సమ్మక్క సారలమ్మ జిల్లాగా చేయాలని అఖిలపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ రహదారిపై 2గంటల పాటు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. గిరిజనశాఖ మంత్రి పర్యటన సందర్భంగా అఖిలపక్ష నాయకులు అడ్డుకునే అవకాశముందనే ముందస్తు సమాచారంతో రాస్తారోకో చేస్తున్న అఖిలపక్ష నాయకులు, విద్యార్థులను పోలీసులు చెదరగొట్టారు. దీంతో అసహనానికి గురైన అహ్మద్‌ పాషా పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *