నయీం ట్రెజర్ హంట్.. గ్యాంగ్ స్టర్ నయీం కిడ్నాప్ లు, దందాలతో వసూలు చేసిన కోటాను కోట్ల డబ్బులు ఎక్కడ ఉన్నాయి.. ఎక్కడ దాచాడు.. కొంత డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేసినా.. మిగతా నగదు ఎక్కడ ఉందనేది సిట్ అధికారులను సైతం ఆసక్తి రేపుతోంది. నయీం గ్యాంగ్ ఎక్కువగా నగదు, బంగారం రూపంలో వసూళ్లు చేసేది. నయీంకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇళ్లు, గెస్ట్ హౌస్ లు, గ్యారేజీల్లో తనిఖీ చేసినా కట్టలకొద్దీ డాక్యుమెంట్లు దొరికాయి తప్ప.. డబ్బు మాత్రం పెద్దగా దొరకలేదు. ఇక నయీంకు బంగారంపైనా బాగా మోజు. తనిఖీల్లో అది కేజీల్లోనే దొరికింది. విచారణలో ఆయన అనుచరులు చెప్పిన విషయాలతో వందల కిలోల బంగారం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. డబ్బు అయితే కోట్ల కట్టలు భారీగా ఉండొచ్చని భావిస్తున్నారు. మరి ఆ నిదులు ఎక్కడ ఉన్నాయి అనే దానిపై ఆరా తీస్తున్నారు సిట్ అధికారులు.
నయీం నిదులు ఎక్కడ ఉన్నాయి అనే దానిపై ఆరా




