మారేడుమిల్లి: తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి మండలం సిరిపెనలోవలో విషాదం చోటుచేసుకుంది. గిరిజనులు కొండపోడుకు పెట్టిన నిప్పు ఓ ఇంటికి వ్యాపించడంతో నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. నిన్న మధ్యాహ్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాద వార్త ఈరోజు తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలికి బయలుదేరి వెళ్లారు. సిరిపెనలోవ మారుమూల ప్రాంతం కావడంతో అధికారులకు చాలా ఆలస్యంగా సమాచారం అందింది. మృతులను రాజేశ్వరి(7), పెదరామిరెడ్డి(4), చినరామిరెడ్డి(1), రామలక్ష్మి(1)గా గుర్తించారు. వీరిలో చినరామిరెడ్డి, రామలక్ష్మి కవలలు.