Wednesday, 4 November 2026

నాంపల్లి కోర్టులో హీరో మంచు విష్ణుకు చుక్కెదురు

హైద్రాబాద్‌, నవంబర్‌22(జనంసాక్షి): నాంపల్లి కోర్టులో హీరో మంచు విష్ణుకు చుక్కెదురైంది. బ్రాహ్మణులపై దాడి కేసులో విష్ణు గురువారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. దీంతో ఈ సమాచారం తెలుసుకున్న బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో కోర్టుకు చేరుకున్నారు. అనంతరం విష్ణుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్రాహ్మణులపై దాడి కేసులో నాంపల్లి కోర్టు విష్ణు వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. తమ కుటుంబానికి పిండం పెట్టడం పట్ల విష్ణు కోర్టులో ప్రయివేటు పిటిషన్‌ దాఖలు చేశాడు. కాగా మరో వైపు హైకోర్టులో దేనికైనా రెడీ వివాదానికి సంబంధించిన పిటిషన్‌ దాఖలు అయిన నేపధ్యంలో కోర్టు విచారణ ప్రారంభించింది. కాగా బ్రాహ్మణుల ఆందోళన చేస్తారన్న భయంతో విష్ణు భారీగా ప్రైవేటు భద్రతను తెచ్చుకొన్నాడు. అయినప్పటికీ నిరసన ఎదుర్కొనక తప్పలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *